భారీ అంచనాల నడుమ వరల్డ్ వైడ్ గా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా రికార్డ్ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. వరల్డ్ వైడ్ గా 223 కోట్ల బిగ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగుతున్న ఈ సినిమా ఈ ఇయర్ ఇండియా వైడ్ గా బిగ్…
రిలీజ్ ను సొంతం చేసుకోబోతున్న మొదటి సినిమాగా నిలవనుంది….తెలుగు రాష్ట్రాల్లో సాలిడ్ రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. నైజాంలో ఆల్ మోస్ట్ 360-380 రేంజ్ లో థియేటర్స్ లో సినిమా రిలీజ్ ను సొంతం చేసుకోబోతూ ఉండగా ఆంధ్ర సీడెడ్ ఏరియాలు కలిపి ఇప్పుడు…
900 వరకు థియేటర్స్ లో ఓవరాల్ గా రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో ఓవరాల్ గా సినిమా 1280 రేంజ్ లో థియేటర్స్ లో రిలీజ్ కానుంది. ఇక తమిళనాడులో సినిమా 400 వరకు థియేటర్స్ లో గ్రాండ్ గా రిలీజ్ కానుంది…
కర్ణాటకలో ఓవరాల్ గా 200 వరకు థియేటర్స్ లో కేరళలో 150కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కానుంది..ఇక హిందీ లో సినిమా కి సుమారు 2400 వరకు స్క్రీన్ కౌంట్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉండగా….ఓవరాల్ గా ఇండియా లోనే సినిమా ఇప్పుడు…
4400 రేంజ్ లో థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఇక ఓవర్సీస్ లో టోటల్ థియేటర్స్ కౌంట్ లెక్క 2200 వరకు ఉండే అవకాశం ఉన్న నేపధ్యంలో వరల్డ్ వైడ్ గా సినిమా ఇప్పుడు 6600 వరకు థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది…. మొత్తం మీద టాలీవుడ్ మూవీస్ లో…
వన్ ఆఫ్ ది హైయెస్ట్ థియేటర్స్ కౌంట్ ను సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటిగా నిలవబోతున్న గేమ్ చేంజర్ మూవీ కి ఇక ఆడియన్స్ నుండి పాజిటివ్ టాక్ వచ్చేస్తే ఇక కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ ను ఓ రేంజ్ లో షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.