బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి మూడు సినిమాల మధ్య స్ట్రాంగ్ పోటి ఉండబోతూ ఉండగా ఎక్కువ పోటి మాత్రం రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ చేంజర్(Game Changer) మూవీ బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) మధ్య నువ్వా నేనా అన్నట్లు ఉండే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…
ఇక రెండు సినిమాల నార్త్ అమెరికా ప్రీ బుకింగ్స్ ఓపెన్ చేసి చాలా రోజులు అవుతూ ఉండగా రెండు సినిమాల బుకింగ్స్ ట్రెండ్ కూడా మరీ అనుకున్న రేంజ్ లో లేవు, గేమ్ చేంజర్ బుకింగ్స్ ట్రెండ్ కొంచం వీక్ గానే ఉండగా డాకు మహారాజ్ మూవీ బుకింగ్స్ ట్రెండ్ ఓవరాల్ గా…
బాలయ్య ప్రీవియస్ మూవీ భగవంత్ కేసరి కన్నా కూడా తక్కువగానే ఉన్నాయి ఇప్పటి వరకు…. ఓవరాల్ గా రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మరో వారం నుండి సందడి చేయడానికి సిద్ధం అవుతూ ఉండగా… ఓవరాల్ గా రెండు సినిమాల ప్రజెంట్ ట్రెండ్ బుకింగ్స్ ను గమనిస్తే…
గేమ్ చేంజర్ మూవీ నార్త్ అమెరికా టోటల్ ప్రీ బుకింగ్స్ గ్రాస్ 395 పైగా లోకేషన్స్ లో 1130కి పైగా షోలలో ఓవరాల్ గా $380K మార్క్ ని క్రాస్ చేసింది ఇప్పుడు…రీసెంట్ బిగ్ పాన్ ఇండియా మూవీస్ తో పోల్చితే ఇవి చాలా తక్కువే అని చెప్పాలి. రిలీజ్ కి ఇంకా 8 రోజుల టైం ఉంది…
ఇక బాలయ్య నటించిన డాకు మహారాజ్ మూవీ…125 కి పైగా లోకేషన్స్ లో 340కి పైగా షోలలో ఓవరాల్ గా $92K మార్క్ ని క్రాస్ చేసింది…. మొత్తం మీద రెండు సినిమాల ట్రెండ్ జస్ట్ యావరేజ్ రేంజ్ లోనే ఉండగా డాకు మహారాజ్ ప్రీమియర్స్ కి ఇంకా 10 రోజుల టైం ఉండగా…
రెండు సినిమాల బుకింగ్స్ ట్రెండ్ కి మంచి బూస్టప్ రావాలి అంటే మాత్రం సినిమాల ట్రైలర్ లు సాలిడ్ గా రచ్చ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక రెండు సినిమాల ట్రైలర్స్ రిలీజ్ తర్వాత బుకింగ్స్ ట్రెండ్ లో ఎలాంటి గ్రోత్ సొంతం అవుతుందో చూడాలి…