Home న్యూస్ గేమ్ చేంజర్-పుష్ప2-దేవర…1st సాంగ్స్ వ్యూస్-లైక్స్ రిపోర్ట్!

గేమ్ చేంజర్-పుష్ప2-దేవర…1st సాంగ్స్ వ్యూస్-లైక్స్ రిపోర్ట్!

0

ఎందుకో రీసెంట్ టైంలో పాన్ ఇండియా మూవీస్ నుండి వచ్చే అప్ డేట్స్ అంచనాలను మ్యాచ్ చేయలేక పోతున్నాయి. రీసెంట్ గా బాక్స్ ఆఫీస్ దగ్గర త్వరలో సందడి చేయబోతున్న మూడు పాన్ ఇండియా మూవీస్ నుండి ఫస్ట్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. అన్ని సాంగ్స్ రిలీజ్ కి ముందు పాత లిరికల్ వీడియోల రికార్డులను…

ఈ సాంగ్స్ బ్రేక్ చేస్తాయి అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగడం లేదు, రీజనల్ మూవీస్ నెలకొల్పిన వ్యూస్ అండ్ లైక్స్ రికార్డులు 24 గంటల్లో ఈ సాంగ్స్ అవలీలగా బ్రేక్ చేస్తాయి అనుకున్నా కూడా చాలా సాదాసీదా రెస్పాన్స్ ను మాత్రమే ఈ సాంగ్స్ సొంతం చేసుకున్నాయి. ఈ ఇయర్ లో రిలీజ్ కాబోతున్న….

రామ్ చరణ్(Ram Charan) గేమ్ చేంజర్(Game Changer) నుండి జరగండి జరగండి(Jaragandi Song), అల్లు అర్జున్(Allu Arjun) పుష్ప2 ది రూల్(Pushpa 2 The Rule Movie) నుండి ఫస్ట్ సాంగ్ పుష్ప పుష్ప(PUSHPA PUSHPA Song) మరియు ఎన్టీఆర్(Jr NTR) దేవర(Devara Part 1) నుండి ఫియర్ సాంగ్(Fear Song -Devara Part 1)  లు రీసెంట్ గా రిలీజ్ అయ్యాయి…

ఒకసారి వీటి రెస్పాన్స్ ను గమనిస్తే…ముందుగా గేమ్ చేంజర్ నుండి వచ్చిన జరగండి సాంగ్ 24 గంటల్లో 4.33 మిలియన్ వ్యూస్ మాత్రమే సొంతం అవ్వగా లైక్స్ పరంగా 24 గంటల్లో 288.8K లైక్స్ మార్క్ ని మాత్రమే అందుకుంది…ముందే పాట లీక్ అవ్వడం మైనస్ అయినా మరీ ఇంత తక్కువ రెస్పాన్స్ ను ఎవ్వరూ ఊహించలేదు…

ఇక తర్వాత వచ్చిన  పుష్ప పుష్ప సాంగ్ 24 గంటల్లో 10.38 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 564.2K లైక్స్ ను సొంతం చేసుకుని 24 గంటల్లో ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది, కానీ సినిమా పాన్ ఇండియా హైప్ కి అల్టిమేట్ రికార్డులను నమోదు చేస్తుంది అని అందరూ అనుకున్నారు కానీ అలా జరగలేదు….

ఇక ఎన్టీఆర్ దేవర ఫియర్ సాంగ్ మొత్తం మీద 24 గంటల్లో వ్యూస్ పరంగా 5.19 మిలియన్ వ్యూస్ సొంతం అవ్వగా లైక్స్ పరంగా 473.2K లైక్స్ ను సొంతం చేసుకుంది, ఎన్టీఆర్-అనిరుద్ ల క్రేజీ కాంబో నుండి వచ్చిన పాట కి రికార్డులు అన్నీ బ్రేక్ అవుతాయి అని అందరూ అనుకున్నారు, కానీ అలాంటిది ఏమి జరగలేదు…

ఓవరాల్ గా ఈ మూడు పాన్ ఇండియా మూవీస్ లో పుష్ప2 బెటర్ గా రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది, కానీ ఓవరాల్ గా ఈ సినిమాల రేంజ్ కి ఈ రెస్పాన్స్ చాలా తక్కువే అని చెప్పాలి. మరి వీటితో పాటు వచ్చే ఇతర పాన్ ఇండియా మూవీస్ కి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది, ఆ ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏమైనా ఉంటుందో చూడాలి ఇక…

AP-TG 2nd Day Highest Share Movies

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here