బాక్స్ ఆఫీస్ దగ్గర బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో దూసుకు పోతున్నాడు యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen)…దాస్ క ధమ్కీ, గామి సినిమాల సక్సెస్ ల తర్వాత ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమాతో సందడి చేయబోతూ ఉండగా ఈ సినిమా…
ఆడియన్స్ ముందుకు ఇప్పుడు శుక్రవారం గ్రాండ్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంటూ ఉండగా పోటిలో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఈ వీకెండ్ హాట్ ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ఇక సినిమా మొత్తం మీద తెలుగు రాష్ట్రాల్లో 500 వరకు స్క్రీన్స్ లో రిలీజ్ కానుండగా వరల్డ్ వైడ్ గా 650 కి పైగా స్క్రీన్స్ లో రిలీజ్ కాబోతుంది.
Gangs Of Godavari Movie Pre Release Business – Break Even Target
ఇక సినిమా తెలుగు రాష్ట్రాల వాల్యూ బిజినెస్ రేంజ్ 8 కోట్ల దాకా ఉండగా వరల్డ్ వైడ్ గా వాల్యూ బిజినెస్ రేంజ్ 10 కోట్ల దాకా ఉంటుందని అంచనా…దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అయింది అని చెప్పడానికి మినిమమ్ 11 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంటే సరిపోతుంది. సినిమా సోలో రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బిజినెస్ ఎక్కువగానే జరిగి ఉండేది…
కానీ ఇతర సినిమాల పోటి వలన ఆల్ మోస్ట్ రీజనబుల్ బిజినెస్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా ఓపెనింగ్స్ నుండే మంచి జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉంది. ఇక సినిమాకి పాజిటివ్ టాక్ కనుక ఆడియన్స్ నుండి వస్తే ఈజీగా టార్గెట్ ను అందుకుని లాభాలను కూడా సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.
మరి బాక్ టు బాక్ హిట్స్ తో మంచి జోరు మీద ఉన్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో కూడా అంచనాలను అందుకుంటే హాట్రిక్ ని కంప్లీట్ చేసుకోవడమే కాదు తన మార్కెట్ రేంజ్ ని కూడా పెంచుకునే అవకాశం ఉంది. మరి గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి మ్యాజిక్ ని చూపిస్తుందో చూడాలి ఇప్పుడు.