Home న్యూస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెన్సార్ రిపోర్ట్…విశ్వక్ సేన్ మాస్ ఖాయం!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సెన్సార్ రిపోర్ట్…విశ్వక్ సేన్ మాస్ ఖాయం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర టాలీవుడ్ కి ఓ మంచి హిట్ పడాలి…సమ్మర్ లో ఒక్క సినిమా కూడా ఆడియన్స్ ను మెప్పించలేక పోయింది. ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు ఇప్పుడు మే ఎండ్ టైంలో మూడు సినిమాలు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా వాటిలో యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak Sen) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా ….

మంచి బజ్ నడుమ రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది…కాగా రీసెంట్ గా సినిమా సెన్సార్ పనులను పూర్తి చేసుకోగా యు/ఏ సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది….సినిమా ఇనీషియల్ టాక్ కూడా బయటికి రాగా కథ పాయింట్ ఓవరాల్ గా గోదావరి జిల్లలో పాలిటిక్స్ లోకి ఎంటర్ అయిన ఒక యువ నాయకుడి లైఫ్ లో…

ఎలాంటి పరిస్థితులు ఫేస్ చేశాడు…తన ఊరివాళ్ళతోనే అయిన గొడవలు ఎంత దూరం వెళ్ళాయి అన్న పాయింట్ తో సినిమా ఉంటుందని, విశ్వక్ సేన్ కెరీర్ టర్నింగ్ పాయింట్ గా ఈ సినిమా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు…సినిమాలో యాక్షన్ సీన్స్ ఓ రేంజ్ లో ఉండగా డైలాగ్స్ కొన్ని చోట్ల హద్దులు దాటినట్లు అనిపించినా…

చాలా చోట్ల బీప్ సౌండ్స్ ను వాడినట్లు చెబుతున్నారు….బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి మరో మేజర్ ప్లస్ పాయింట్ అని అంటూ ఉండగా, సెకెండ్ ఆఫ్ కథ కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా ఓవరాల్ గా సినిమా ఎబో యావరేజ్ టు హిట్ లెవల్ లో అనిపించింది అన్న టాక్ అయితే సెన్సార్ వాళ్ళ నుండి వినిపిస్తుంది…

సెన్సార్ రిపోర్ట్స్ చాలా వరకు పాజిటివ్ గానే ఉంటాయి కానీ ట్రైలర్ తోనే చాలా వరకు ఆకట్టుకున్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీ ఆడియన్స్ మనసు గెలిచే అవకాశం ఎంతైనా ఉందని అంటున్నారు. సెన్సార్ రిపోర్ట్ కనుక నిజం అయితే కచ్చితంగా టాలీవుడ్ 2 నెలల నుండి ఎదురు చూస్తున్న హిట్ సొంతం అయ్యే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here