Home న్యూస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రివ్యూ….విశ్వక్ సేన్ మాస్ రాంపెజ్ ఇది!!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ట్రైలర్ రివ్యూ….విశ్వక్ సేన్ మాస్ రాంపెజ్ ఇది!!

0

బాక్ టు బాక్ హిట్స్ తో కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటిస్తున్న లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie) సినిమా చాలా సార్లు పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు ఎట్టకేలకు ఈ నెల ఎండ్ లో రిలీజ్ కాబోతుంది. ఇతర సినిమాల నుండి పోటి ఉన్నా కూడా ఆ వీకెండ్ లో హాట్ ఫేవరేట్ ఈ సినిమానే అని చెప్పాలి..

ఇక రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చూస్తుంటే విశ్వక్ సేన్ మాస్ రాంపెజ్ లా అనిపించింది అని చెప్పాలి. గోదావరి జిల్లాలో యువ నాయకుడిగా ఎదగాలి అనుకున్న హీరోకి ఎలాంటి సవాళ్లు ఎదురు అయ్యాయి, హీరోని అడ్డుకోవాలని చూసిన విలన్స్ పై హీరో పైచేయి ఎలా సాధించాడు, మధ్యలో తన లవ్ స్టోరీ ఎలా సాగింది…లాంటి కాన్సెప్ట్ తో…

వచ్చిన గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ట్రైలర్ వరకు మరీ అద్బుతమైన కథలా ఏమి అనిపించకపోయినా కూడా కమర్షియల్ సినిమాలకు ఉండాల్సిన అన్ని ఎలిమెంట్స్ పక్కాగా ఉన్నాయి అనిపించేలా ఉందని చెప్పొచ్చు, విశ్వక్ సేన్ మంచి ఈజ్ తో మాస్ రోల్ లో అల్టిమేట్ గా పెర్ఫార్మ్ చేశాడని ట్రైలర్ చూస్తె అర్ధం అవుతుంది…

కానీ డైలాగ్స్ కొంచం హద్దులు దాటిపోయినట్లు ట్రైలర్ వరకు అనిపించింది….అది ఒక్కటి తప్పితే రిచ్ విజువల్స్, మాస్ ఎలిమెంట్స్, ఎక్స్ లెంట్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఇలా అన్నీ ట్రైలర్ లో బాగానే మెప్పించాయి. ఓవరాల్ గా ట్రైలర్ సినిమా మీద ఆడియన్స్ లో మంచి అంచనాలను పెంచేసేలా ఉందని చెప్పొచ్చు.

ఇక సినిమా రిలీజ్ అయ్యాక ఆడియన్స్ నుండి సినిమాకి మంచి టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర ఆల్ రెడీ కెరీర్ బెస్ట్ ఫామ్ లో ఉన్న విశ్వక్ సేన్ ఈ సినిమాతో హాట్రిక్ ని పూర్తి చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది…పోటి ఉన్నా కూడా ఈ సినిమానే ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయిస్ అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రస్తుతానికి….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here