Home న్యూస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి రివ్యూ…ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!

0

బాక్ టు బాక్ మంచి విజయాలను సొంతం చేసుకున్న యంగ్ హీరో విశ్వక్ సేన్(Vishwak Sen) నటించిన లేటెస్ట్ మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie REVIEW RATING) సినిమా ఆడియన్స్ ముందుకు వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ అయింది… మాస్ కంటెంట్ తో వచ్చిన ఈ సినిమా తన కెరీర్ టర్నింగ్ పాయింట్ అవుతుందని విశ్వక్ సేన్ నమ్ముతుండగా సినిమా ఎంతవరకు ఆ అంచనాలను నిజం చేసిందో తెలుసుకుందాం పదండీ…

ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే ఊర్లో ఉండే హీరో తన ఫ్యూచర్ ప్లానింగ్ చేసుకుని MLA గ్రూప్ లో చేరతాడు, తర్వాత హీరోయిన్ నేహశెట్టి(Neha Shetty) తో ప్రేమలో పడగా తర్వాత అనూహ్య పరిస్థితుల నడుమ పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతాడు…ఆ తర్వాత కథ ఏమయింది…మధ్యలో అంజలి రోల్ ఏంటి…ఈ పరిస్థితులను హీరో ఎలా సాల్వ్ చేశాడు అన్నది మొత్తం మీద సినిమా కథ…

కథగా చెప్పాలి అంటే చాలా రొటీన్ గా అనిపించే కథనే…కానీ ఉన్నంతలో పడుతూ లేస్తూ ఫస్టాఫ్ వరకు డైరెక్టర్ కృష్ణ చైతన్య బాగానే మ్యానేజ్ చేశాడు. మధ్యలో ఒక సూపర్ హిట్ సాంగ్ అలాగే ఎక్స్ లెంట్ ఫైట్ సీన్ ఒకటి ఫస్టాఫ్ లో హైలెట్ గా నిలవడం ఇంటర్వెల్ ఎపిసోడ్ బాగానే వర్కౌట్ అవ్వడంతో సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెరిగిపోతాయి.

కానీ చాలా వరకు చెప్పాల్సిన కథని ఫస్టాఫ్ లోనే డైరెక్టర్ చెప్పేయడంతో సెకెండ్ ఆఫ్ లో చెప్పడానికి కథ లేకుండా పోవడంతో స్క్రీన్ ప్లే పరంగా స్లో నరేషన్ తో ఎటు నుండి ఎటో వెళుతూ ఎలాగోలా క్లైమాక్స్ జస్ట్ ఓకే అనిపించేలా ముగుస్తుంది. సెకెండ్ ఆఫ్ పై మరింత శ్రద్ధ పెట్టి ఉంటే ఔట్ పుట్ ఇంకా చాలా బెటర్ గా వచ్చి ఉండేది….

విశ్వక్ సేన్ సినిమా కోసం ఎంత చేయాలో అంత చేశాడు, యాక్షన్ సీన్స్, మాస్ డైలాగ్స్, హీరోయిజం ఎలివేట్ సీన్స్ అన్నింటిలో తన మార్క్ క్లియర్ గా మెప్పించగా నేహా శెట్టి రోల్ కూడా ఆకట్టుకుంది, అంజలి పర్వాలేదు అనిపించగా మిగిలిన యాక్టర్స్ తమ తమ రోల్స్ వరకు పర్వాలేదు అనిపించారు…

సంగీతం సినిమాకి ప్లస్ పాయింట్ కాగా ఫస్టాఫ్ లో ఒక సాంగ్ సెకెండ్ ఆఫ్ లో ఒక సాంగ్ బాగానే వర్కౌట్ అవ్వగా ఫైట్ సీన్స్ కి బ్యాగ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది…ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో ట్రాక్ తప్పింది… డైలాగ్స్ బాగానే ఉండగా సినిమాటోగ్రఫీ మెప్పించింది ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్ గా ఉన్నాయి.

ఇక డైరక్టర్ ఎంచుకున్న పాయింటే అంత బలంగా లేదు, కానీ ఎలాగోలా ఫస్టాఫ్ వరకు బాగానే మ్యానేజ్ చేసినా ముందే చెప్పినట్లు సెకెండ్ ఆఫ్ లో ట్రాక్ తప్పింది… మొత్తం మీద మాస్ అండ్ కమర్షియల్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ సెకెండ్ ఆఫ్ ని కొంచం ఓపిక పట్టి చూడగలిగితే ఓవరాల్ గా పర్వాలేదు అనిపించేలా ఉంటుంది ఈ సినిమా, మరీ ఎక్స్ పెర్టేషన్స్ ఎక్కువగా పెట్టుకుని వెళితే కొంచం నిరాశ కలిగిస్తుంది ఈ సినిమా..ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here