అసలు ఎవ్వరికీ పరిచయం లేని నటీనటులతో కొత్త ప్రయోగం చేస్తూ తీసిన సినిమా గతం, డిఫెరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమా ను చాలా కాలంగానే రిలీజ్ చేయాలనీ ట్రై చేశారు కానీ కుదరలేదు, రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ వాళ్ళు ఈ సినిమా ను కొని రీసెంట్ గా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేయగా సినిమా కి సోషల్ మీడియా లో చూసిన వాళ్ళ నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది.
ఒకసారి సినిమా కథ విశేషాలు ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ… కథ పాయింట్ కి వస్తే… హాస్పిటల్ లో గతం కోల్పోయిన హీరో కి లవర్ నేనే అంటూ తన బిల్స్ కడుతుంది హీరోయిన్, తన గత గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తున్న హీరో తన తండ్రి దగ్గరకు వెళ్ళాలని….
హీరోయిన్ తో చెప్పగా ఇద్దరూ ప్రయాణం అవుతున్న టైం లో కారు సడెన్ గా ఆగిపోవడం తో అడవి ప్రాంతంలో నివాసం ఉండే ఒక వ్యక్తీ ఇంట్లో నివాసం ఆఫర్ చేస్తాడు ఆ వ్యక్తీ, ఆ ఇంటికి వెళ్ళాక ఊహించని మలుపులు ఎదురు అవుతాయి, తర్వాత ఊహించని ట్విస్ట్ లతో…
షాకింగ్ నిజాలు హీరో గురించి హీరో గతం గురించి తెలుస్తుంది, ఈ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లతో కొనసాగే సినిమా లో అసలు హీరోలు ఎవరు విలన్లు ఎవరు అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. పెర్ఫార్మెన్స్ పరంగా ఉన్నది తక్కువ మందే అయినా కానీ ప్రతీ ఒక్కరు చాలా బాగా నటించి మెప్పిస్తారు.
ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే చాలా బాగున్నాయి, డల్ మూమెంట్స్ కానీ, బోర్ కొట్టించే సీన్స్ చాలా తక్కువ ఉండటం విశేషం, సినిమా లెంత్ కూడా గంటా 40 నిమిషాలు అవ్వడం తో స్క్రీన్ ప్లే మెప్పిస్తుంది, సినిమాటోగ్రఫీ టాప్ నాట్చ్ అనే చెప్పాలి. కంప్లీట్ ఫారన్ లోనే షూటింగ్ అవ్వడం తో….
లోకేషన్స్ అండ్ గ్రాండియర్ బాగున్నాయి, పాటలు సినిమాలో లేవు, బ్యాగ్రౌండ్ స్కోర్ ఆకట్టుకుంటుంది… ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి, ఇక డైరెక్షన్ విషయానికి వస్తే కిరణ్ కొండమడుగుల కొత్తవాడే అయినా ఉన్న లిమిట్స్ లో చాలా బెటర్ గా సినిమాను తెరకెక్కించి మెప్పించాడు.
మొత్తం మీద థ్రిల్లర్ మూవీ గా మొదలై, సైకో థ్రిల్లర్ జానర్ ని టచ్ చేస్తూ సినిమా ఉన్నంతలో చాలా బాగా ఆకట్టుకుంది, గట్టిగా చెప్పాలి అంటే రీసెంట్ గా థ్రిల్లర్, సైకో థ్రిల్లర్స్ అంటూ డైరెక్ట్ రిలీజ్ ని సొంతం చేసుకున్న చాలా పెద్ద సినిమాల కన్నా కూడా బెటర్ మూవీ ఇది…
ఫస్ట్ 10- 15 నిముషాలు కూర్చుంటే మిగిలిన సినిమా మొత్తం కంప్లీట్ ఈజీగా అవుతుంది, క్లైమాక్స్ ట్విస్ట్ కూడా మెప్పిస్తుంది, లెంత్ తక్కువ అయినా ఎంగేజింగ్ బ్లాక్స్ ఉండటం ఈ సినిమా ప్రత్యేకత అని చెప్పాలి. ఓవరాల్ గా థ్రిల్లర్ మూవీస్ ని, సైకో థ్రిల్లర్ మూవీస్ ని….
ఇష్టపడే వారిని కచ్చితంగా మెప్పిస్తుంది ఈ సినిమా, రొటీన్ మూవీస్ చూసే వాళ్ళని కూడా ఈజీగా ఒకసారి చూసేలా చేస్తుంది ఈ సినిమా. ఎలాంటి అంచనాలు లేకుండానే సినిమా చూస్తారు కాబట్టి మొత్తం అయ్యాక ఇతర రీసెంట్ థ్రిల్లర్స్ తో పోల్చితే చాలా బెటర్ గా ఉందనిపించడం మాత్రం ఖాయమని చెప్పొచ్చు. సినిమా మా రేటింగ్ 3.25 స్టార్స్…