Home న్యూస్ గీత గోవిందం రెండో వారం థియేటర్స్ కౌంట్…దుమ్ము లేచిపోవడం ఖాయం

గీత గోవిందం రెండో వారం థియేటర్స్ కౌంట్…దుమ్ము లేచిపోవడం ఖాయం

890
0

విజయ్ దేవరకొండ రష్మిక ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి వారంలో అల్టిమేట్ కలెక్షన్స్ తో సెంసేషన్ క్రియేట్ చేసిన విషయం తెలిసిందే.. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర 7 రోజుల తర్వాత రెండో వారంలో అడుగు పెట్టిన గీత గోవిందం సాలిడ్ గా థియేటర్స్ ని హోల్డ్ చేసింది.

కాగా సినిమా మొత్తం మీద ఫస్ట్ వీక్ లో 700 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ఇప్పుడు సెకెండ్ వీక్ లో సినిమా రెండు రాష్ట్రాలలో భారీగానే థియేటర్స్ ని హోల్డ్ చేయబోతుంది. నైజాం లో సినిమా 180 థియేటర్స్ ని రెండో వారం దక్కించుకున్నట్లు సమాచారం.

ఇక ఆంధ్రా మరియు సీడెడ్ లలో సినిమా రెండో వారంలో సుమారు 320 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసిందట. మొత్తం మీద 500 వరకు థియేటర్స్ ని హోల్డ్ చేసిన గీత గోవిందం కచ్చితంగా సెకెండ్ వీక్ లో సాలిడ్ కలెక్షన్స్ ని సాధించడం ఖాయమని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here