Home న్యూస్ ఏం సినిమారా బాబు…3rd వీకెండ్ కూడా భీభత్సమే

ఏం సినిమారా బాబు…3rd వీకెండ్ కూడా భీభత్సమే

972
0

విజయ్ దేవరకొండ రష్మికల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండు వారాల్లో 53 కోట్ల రేంజ్ లో షేర్ ని వసూల్ చేసి సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇక మూడో వారంలో కూడా సినిమా జోరు కొనసాగింది.

మూడో వీకెండ్ లో పోటిలో రిలీజ్ అయిన సినిమాల కన్నా కూడా గీత గోవిందం సినిమానే బాక్స్ ఆఫీస్ దగ్గర జోరు చూపి ఆదివారం రోజున ఓ రేంజ్ లో గ్రోత్ ని సాధించి ఓవరాల్ గా మూడో వీకెండ్ మొత్తం మీద సాలిడ్ కలెక్షన్స్ ని సాధించినట్లు సమాచారం.

టోటల్ గా ఇప్పటి వరకు కలెక్షన్స్ 55 కోట్లకు పైగానే ఉన్నాయని సమాచారం. ఏరియాల వారి కలెక్షన్స్ వివరాలు ఇంకా రిలీజ్ చేయలేదు కానీ మొత్తం మీద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అత్యంత భారీ లాభాలను సొంతం చేసుకున్న సినిమాల జాబితా లో ఎంటర్ అయ్యింది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here