తమిళనాడు లో మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ భరత్ అనే నేను సినిమా టోటల్ రన్ లో 4.3 కోట్ల గ్రాస్ ని వసూల్ చేసి డైరెక్ట్ తెలుగు సినిమాల పరంగా సరికొత్త సంచలన ఇండస్ట్రీ రికార్డు ను నమోదు చేసింది. ఇప్పుడు ఆ రికార్డును గీత గోవిందం సినిమా బ్రేక్ చేసింది.
సినిమా మూడో వీకెండ్ లోపే అక్కడ టోటల్ గా 5.05 కోట్ల గ్రాస్ ని అందుకోగా ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్ ను సొంతం చేసుకుంది. రెండు వారాలలోనే అక్కడ భరత్ అనే నేను రికార్డ్ బ్రేక్ అయిందట. దాంతో ఇప్పుడు టోటల్ రన్ లో గీత గోవిందం సాధించే కలెక్షన్సే మిగిలిన అన్ని సినిమాలకు సరికొత్త టార్గెట్ అని చెప్పొచ్చు.