ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఇప్పుడు 20 రోజుల్లో 61 కోట్లకు పైగా కలెక్షన్స్ తో సెన్సేషనల్ రన్ ని కొనసాగిస్తున్న ఈ సినిమా ఇప్పుడు మరో 1.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే చాలు సరికొత్త హిస్టారికల్ రికార్డ్ ను అందుకున్న సినిమాగా నిలుస్తుంది.
తెలుగు సినిమా చరిత్రలో బాహుబలి ని తప్పిస్తే రంగస్థలం సినిమానే 80 కోట్ల బిజినెస్ కి 127.5 కోట్ల షేర్ తో 47.5 కోట్ల లాభాన్ని దక్కించుకుంది. ఇప్పుడు గీత గోవిందం 15 కోట్ల బిజినెస్ కి ఇప్పటికే 61 కోట్లు వసూల్ చేసి 46 కోట్ల లాభాన్ని అందుకోగా మరో 1.5 కోట్ల షేర్ ని అందుకుంటే చరిత్ర చిరిగిపోవడం ఖాయమని చెప్పొచ్చు.