Home న్యూస్ తమిళ్ గడ్డపై ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన గీత గోవిందం

తమిళ్ గడ్డపై ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన గీత గోవిందం

1022
0

విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన కలెక్షన్స్ తో మొదటి వీకెండ్ లో 31.7 కోట్ల షేర్ ని సాధించి సంచలనం సృష్టించగా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని సాధించి సూపర్బ్ గా హోల్డ్ చేసింది.

ఇక సినిమా సాధించిన ఒక అద్బుతమైన ఫీట్ ఏంటి అంటే సినిమా తమిళ గడ్డపై ఏకంగా ఇండస్ట్రీ రికార్డ్ ను నెలకొల్పబోతుంది. అక్కడ టోటల్ రన్ లో భరత్ అనే నేను 4.21 కోట్ల గ్రాస్ ని రంగస్థలం 3.41 కోట్ల గ్రాస్ ని టోటల్ గా అందుకుని చరిత్ర సృష్టించాయి.

కానీ ఇక్కడ అందరికీ షాక్ ఇచ్చే రేంజ్ లో గీత గోవిందం సినిమా 5 రోజులలోనే అక్కడ 3.34 కోట్ల గ్రాస్ ని అందుకుంది. దాంతో రానున్న రోజుల్లో అక్కడ భరత్ అనే నేను ని క్రాస్ చేసినా ఆశ్యర్యపోనవసరం లేదని ట్రేడ్ విష్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your name here
Please enter your comment!