Home గాసిప్స్ రేసు నుండి తప్పుకున్న గని….కారణం ఇదేనా!

రేసు నుండి తప్పుకున్న గని….కారణం ఇదేనా!

1276
0

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన బాక్సింగ్ నేపధ్యం మూవీ గని, రీసెంట్ గా సినిమా టీసర్ రిలీజ్ అవ్వగా మంచి రెస్పాన్స్ నే టీసర్ సొంతం చేసుకుంది, సినిమాను ముందుగా వచ్చే నెల 10 న రిలీజ్ చేయాలనీ అనుకున్నారు కానీ మళ్ళీ ఎందుకో డిసెంబర్ 24న రిలీజ్ చేస్తున్నాం అని ప్రకటించారు. కానీ అదే రోజు ఆల్ రెడీ నాని నటిస్తున్న శ్యామ్ సింగ రాయ్ సినిమాను అనౌన్స్ చేశారు.

కానీ అదే డేట్ కి గని ని కూడా అనౌన్స్ చేయడంతో పోటి ఇక తప్పదు అనుకున్నారు, కానీ ఆ టైం కి పుష్ప థియేటర్స్ లో భారీగా థియేటర్స్ ని హోల్డ్ చేసి రెండో వారాన్ని కొనసాగించడం ఖాయం అవ్వగా శ్యామ్ సింగ రాయ్ కూడా ఎట్టి పరిస్థితులలో ఆ డేట్ కే వస్తామని చెప్పడంతో…

కచ్చితంగా థియేటర్స్ చాలినన్ని ఉండవు అని గ్రహించి అలాగే పోటి లో ఇద్దరికీ ఎఫెక్ట్ కాబట్టి రేసు నుండి గని తప్పుకుని ఇప్పుడు జనవరి 26న రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది, త్వరలోనే దీని పై అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాబోతుంది… ఇక శ్యామ్ సింగ రాయ్ కి పెద్దగా ఇబ్బంది ఉండే ఛాన్స్ తక్కువే అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here