బాక్స్ ఆఫీస్ దగ్గర మంచు విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా డీసెంట్ టాక్ ని సొంతం చేసుకున్నా కానీ ఆడియన్స్ ను థియేటర్స్ కి రప్పించే విషయంలో మాత్రం తీవ్రంగానే విఫలం అయ్యింది అని చెప్పాలి. ఏ దశలో కూడా ఇటు తెలుగు రాష్ట్రాల్లో అటు ఓవర్సీస్ లో కూడా జనాలు సినిమాను అసలు మినిమమ్ పట్టించుకోనూ లేదని చెప్పాలి. దాంతో కలెక్షన్స్ పరంగా సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఓవర్సీస్ లో ఇలాంటి రొటీన్ కమర్షియల్ మూవీస్ ని పెద్దగా ఇష్టపడరు, దానికి తోడూ సినిమా ప్రీమియర్స్ తో కాకుండా ఒకరోజు ఆలస్యంగా రిలీజ్ చేయగా ఇక్కడ టాక్ అక్కడ కూడా స్ప్రెడ్ అయ్యి సినిమా ఓపెనింగ్స్ పై ఇంపాక్ట్ చూపి…
మొత్తం మీద మొదటి వీకెండ్ తో పాటు సోమవారం కలెక్షన్స్ తో కలిపి అమెరికాలో పట్టుమని $1500 డాలర్స్ ని మాత్రమే సినిమా సొంతం చేసుకుంది, అంటే ఇండియన్ కరెన్సీ లో సినిమా 1 లక్షా 28 వేల రూపాయల గ్రాస్ మాత్రమే అక్కడ…
సొంతం చేసుకోగా అక్కడ పబ్లిసిటీ ఖర్చులు కూడా సినిమా రికవరీ చేయలేక పోయింది, దాంతో ఇక్కడితో పాటు అక్కడ కూడా కలెక్షన్స్ చూసి అందరి మైండ్ బ్లాంక్ అయింది అని చెప్పాలి. ఎలాగూ ఈ వీక్ లో పెద్దగా నోటబుల్ మూవీస్ లేవు కాబట్టి ఏమైనా గ్రోత్ ని సినిమా చూపిస్తుందో చూడాలి.