బాక్స్ అఫీస్ దగ్గర మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి పర్వాలేదు అనిపించే రేంజ్ లో టాక్ ఆడియన్స్ నుండి వచ్చినా కానీ అసలు జనాలు ఈ సినిమాను మినిమమ్ పట్టించుకోలేదు అనే చెప్పాలి. సినిమా మిగిలిన సినిమాలతో పోల్చితే తక్కువ థియేటర్స్ లోనే రిలీజ్ అవ్వగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఓపెనింగ్స్ తీవ్రంగా నిరాశ పరిచాయి ఇప్పుడు…
మొత్తం మీద మొదటి రోజు సినిమా తెలుగు రాష్ట్రాల్లో అటూ ఇటూగా 12 లక్షల దాకా షేర్ ని సొంతం చేసుకుంది, కొన్ని చోట్ల ఈ సినిమా కి జనాలు లేక షోలు కూడా కాన్సిల్ అవ్వగా కొన్ని చోట్లా కాంతార సినిమాను రిప్లేస్ చేశారు…
టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా మొదటి రోజు పట్టుమని 15 లక్షల రేంజ్ లో కూడా షేర్ ని అందుకోలేదు, అవి కూడా నెగటివ్ షేర్స్, డెఫిసిట్ లు తీయకుండా చెబుతున్న కలెక్షన్స్ … బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ ….
4.50 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 5 కోట్ల మేర కలెక్షన్స్ ని సాధించాల్సి ఉంటుంది, సినిమా మొదటి రోజే ఆల్ మోస్ట్ డిసాస్టరస్ ఓపెనింగ్స్ ని అందుకోవడంతో ఇక తేరుకోవడం కష్టమే అని చెప్పాలి ఇప్పుడు. ఇక వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలా పెర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.