Home న్యూస్ జిన్నా మూవీ రివ్యూ….సినిమా హిట్టా-ఫట్టా!!

జిన్నా మూవీ రివ్యూ….సినిమా హిట్టా-ఫట్టా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతున్న మంచు విష్ణు ఎంటర్ టైన్ మెంట్ జానర్ లో చాలా గ్యాప్ తర్వాత చేసిన సినిమా జిన్నా.. ఆడియన్స్ ముందుకు దీపావళి రేసులో చాలా సినిమాల మధ్య పోటిలో రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది, మంచు విష్ణు కి కంబ్యాక్ మూవీగా నిలిచిందో లేదో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే… ఊర్లో టెంట్ హౌస్ నడుపుకుంటూ ఉండే హీరో ఆ ఊరిలో అప్పులు ఎక్కువ అవ్వడంతో…

ఎలాగైనా ఆ ఊరికి ప్రెసిడెంట్ అయ్యి అప్పులన్నీ తీర్చాలని అనుకుంటూ ఉంటాడు, చిన్నప్పటి నుండి తనతో కలిసి పెరిగిన పాయల్ ని ఇష్టపడతాడు హీరో, కానీ అప్పుల వలన ఇబ్బందుల్లో ఉన్న టైం లో అమెరికా నుండి సన్నీ లియోన్ వచ్చి హీరో కి హెల్ప్ చేస్తుంది, తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ముందుగా ఈ సినిమా కంప్లీట్ గా…

రొటీన్ ఫార్మాట్ లో సాగే కామెడీ ఎంటర్ టైనర్, తర్వాత జరిగే సీన్ ఒకటి 2 సందర్బాలలో తప్పితే అన్ని సార్లు అనుకున్నట్లే జరుగుతూ ఉంటుంది, ఇది గమనించి ఆడియన్స్ సినిమాకి వెళితే కథ ఎలా ఉన్నా కామెడీ కొంచం కష్టంగానే ఉన్నా కూడా ఎంజాయ్ చేయోచ్చు, హర్రర్ టచ్ ఇస్తూ ఈ మధ్య కామెడీ సినిమాలు తక్కువ అవ్వడంతో ఆ జానర్ లో కొద్ది వరకు కామెడీ ఇందులో వర్కౌట్ అయింది.

మంచు విష్ణు తన రోల్ వరకు ఫుల్ న్యాయం చేయగా సెకెండ్ ఆఫ్ లో సన్నీ లియోన్ పాత్ర హైలెట్ అవుతుంది, ఇతర రోల్స్ లో కమెడియన్స్ కామెడీ కొంచం వర్కౌట్ అయింది. ఫస్టాఫ్ వరకు కథ కొంచం పడుతూ లేస్తూ సాగినా ఇంటర్వెల్ ఎపిసోడ్ కొంచం ఆసక్తిగా సాగి సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా సెకెండ్ కొంచం రొటీన్ గానే అనిపించినా కామెడీ పర్వాలేదు అనిపిస్తుంది.

మొత్తం మీద కథ పరంగా పరమ రొటీన్ గా అనిపించినా కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అవ్వడంతో జిన్నా సినిమా ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కి ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది, రీసెంట్ టైం లో మంచు విష్ణు నుండి వచ్చిన సినిమాల కంటే బెటర్ కానీ మరీ ఢీ, దేనికైనా రెడీ రేంజ్ లో అయతే కాదు… మొత్తం మీద కొంచం రొటీన్ అనిపించినా ఒకసారి చూడొచ్చు. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here