మంచు విష్ణు హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ జిన్నా బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి మూవీస్ తో పోటి లో రిలీజ్ అవ్వగా మిగిలిన సినిమాలతో పోల్చితే మొదటి రోజు నుండే అండర్ పెర్ఫార్మ్ చేసిన ఈ సినిమా ఏ దశలో కూడా తిరిగి తేరుకోలేక పోయింది. సోలో గా రిలీజ్ అయ్యి ఉన్నా కొంచం బెటర్ రిజల్ట్ ను సొంతం చేసుకుని ఉండేది ఏమో కానీ పోటి లో రిలీజ్ అవ్వడం…
జిన్నా సినిమాకి తీవ్రంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపించింది, సినిమా కి కూడా కొంచం డీసెంట్ టాకే ఉన్నా కానీ జనాలు అసలు మినిమమ్ పట్టించుకోలేదు అని చెప్పాలి. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ రన్ కూడా చాలా త్వరగానే కంప్లీట్ అవ్వగా…
సినిమా ఫైనల్ రన్ లో ఓవర్సీస్ లో సాధించిన కలెక్షన్స్ భారీగా నిరాశ పరిచాయి. రెగ్యులర్ ప్రీమియర్ షోలు లేకుండా ఒకరోజు ఆలస్యంగా అక్కడ రిలీజ్ అయిన ఈ సినిమా టోటల్ గా అమెరికాలో 1750$ వసూల్ చేయగా టోటల్ ఓవర్సీస్ లో $2135 డాలర్స్ ని అందుకుంది…
అంటే ఇండియన్ కరెన్సీ లో 1 లక్షా 77 వేల రూపాయలు మాత్రమే గ్రాస్ వసూల్ చేసింది ఓవర్సీస్ లో…. సినిమా ప్రింట్స్ ఖర్చులు కూడా అక్కడ రికవరీ చేయలేక బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడింది. సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే వీటికన్నా కొంచం బెటర్ కలెక్షన్స్ ని సినిమా అక్కడ సొంతం చేసుకుని ఉండేది.