బాక్స్ ఆఫీస్ దగ్గర కోలివుడ్ తరుపున రీసెంట్ గా రెండు బాక్ టు బాక్ బిగ్ బడ్జెట్ సినిమాలు రిలీజ్ అయ్యాయి. ప్రస్తుతం కోలివుడ్ నంబర్ 1 గా దూసుకు పోతున్న దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన విజయ్ గోట్(The Greatest Of All Time Movie) అలాగే ఒకప్పుడు కోలివుడ్ నంబర్ వన్ గా ఉన్న…
సూపర్ స్టార్ రజినీకాంత్(Rajinikanth) నటించిన లేటెస్ట్ మూవీ వేటయ్యన్ (Vettaiyan Movie) సినిమాలు రిలీజ్ అవ్వగా రెండు సినిమాలకు కూడా ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ఏమి రాలేదు….రెండు సినిమాలకు కూడా మిక్సుడ్ రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది…
రెండు సినిమాలు వీకెండ్ వరకు బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ రచ్చ చేశాయి…కానీ కీలకమైన వర్కింగ్ డేస్ లో మాత్రం విజయ్ గోట్ మూవీ ఎక్స్ లెంట్ గా హోల్డ్ చేసింది. తమిళనాడుతో పాటు వరల్డ్ వైడ్ గా కూడా సూపర్ స్ట్రాంగ్ కలెక్షన్స్ ని మిక్సుడ్ టాక్ తోనే సొంతం చేసుకుని…
లాంగ్ రన్ లో ఏకంగా 450 కోట్లకు పైగా గ్రాస్ మార్క్ ని అధిగమించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అదే టైంలో వేట్టయన్ కూడా 4 రోజుల వీకెండ్ లో స్ట్రాంగ్ కలెక్షన్స్ ని అందుకోవడంతో పండగ తర్వాత వర్కింగ్ డేస్ లో గోట్ మూవీ మాదిరిగానే హోల్డ్ ని…
చూపెడుతుంది అని అందరూ అనుకున్నా కూడా అలాంటిది ఏమి జరగలేదు. సినిమా వర్కింగ్ డేస్ లో కంప్లీట్ గా స్లో డౌన్ అయిపోయి 200 కోట్ల మార్క్ ని మాత్రమే ప్రస్తుతానికి దాటేసింది… దాంతో క్లీన్ హిట్ ని అందుకోవడం ఇప్పుడు కష్టంగా కనిపిస్తూ ఉండగా కనీసం యావరేజ్ మార్క్ ని…
అందుకోవాలి అన్నా కూడా ఇంకా కష్టపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మొత్తం మీద మిక్సుడ్ రెస్పాన్స్ తో ఒకప్పుడు రజినీ మూవీస్ కి సాలిడ్ లాంగ్ రన్ సొంతం అయ్యేది, కానీ ఇప్పుడు ఆ రేంజ్ రన్ విజయ్ సొంతం చేసుకోగా రజినీ సినిమాలు మిక్సుడ్ రెస్పాన్స్ వస్తే దెబ్బ పడుతున్నాయి….