Home న్యూస్ రెండో రోజు గోట్ పరిస్థితి….ఊహాతీతం సామి!!

రెండో రోజు గోట్ పరిస్థితి….ఊహాతీతం సామి!!

0

కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) నటించిన లేటెస్ట్ మూవీ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తెలుగు రాష్ట్రాల్లో సినిమా ఓపెనింగ్స్ రీసెంట్ టైంలనే లోవేస్ట్ అనిపించే రేంజ్ లో వచ్చాయి….సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకున్న విజయ్ కి ఈ సినిమా ఇక్కడ గట్టి ఎదురుదెబ్బే కొట్టింది…

ఇక రెండో రోజు సినిమా పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఇప్పుడు…మొత్తం మీద ట్రాక్ చేసిన సెంటర్స్ లో ఇప్పటి వరకు సినిమా పట్టుమని 50 లక్షల గ్రాస్ బుకింగ్స్ ను కూడా సొంతం చేసుకోలేక పోయింది. దాంతో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో…

ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే కోటి రేంజ్ లో షేర్ ని అందుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తుంది అని చెప్పాలి ఇప్పుడు. ఇక తమిళనాడులో మాత్రం మంచి హోల్డ్ నే చూపెడుతూ దూసుకు పోతున్న ఈ సినిమా ఓవరాల్ గా…

రెండో రోజు వరల్డ్ వైడ్ గా ఓపెనింగ్స్ పరంగా బాగానే హోల్డ్ చేసినా కూడా విజయ్ కి స్ట్రాంగ్ మార్కెట్ అయిన కేరళ కర్ణాటకలో సైతం రెండో రోజు డ్రాప్స్ గట్టిగానే కనిపిస్తున్నాయి. కానీ తమిళనాడు మరియు ఓవర్సీస్ ఏరియాల్లో మంచి జోరుని చూపెడుతున్న సినిమా…

ప్రజెంట్ ట్రెండ్ ను బట్టి రెండో రోజు వరల్డ్ వైడ్ గా మంచి కలెక్షన్స్ ని అందుకునే అవకాశం ఉంది, కానీ తెలుగు రాష్ట్రాల్లో సినిమా వాల్యూ బిజినెస్ రేంజ్ 21 కోట్ల దాకా ఉండటంతో 22 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా తేరుకోవడం మాత్రం ఇక కష్టంగానే కనిపిస్తుంది….

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here