Home న్యూస్ 600 కోట్ల హీరో మీద హెవీ ట్రోల్స్….24 గంటల్లో కొత్త సాంగ్ కి షాకిచ్చే రెస్పాన్స్!

600 కోట్ల హీరో మీద హెవీ ట్రోల్స్….24 గంటల్లో కొత్త సాంగ్ కి షాకిచ్చే రెస్పాన్స్!

0

సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటూ దూసుకు పోతున్న కోలివుడ్ టాప్ హీరో దళపతి విజయ్(Thalapathy Vijay) కెరీర్ బెస్ట్ ఫామ్ తో మాస్ రచ్చ చేస్తూ ఉండగా లాస్ట్ ఇయర్ వచ్చిన లియో మూవీ అంచనాలను పూర్తిగా అందుకోకపోయినా కూడా మాస్ రచ్చ చేసి విజయ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ తో ఏకంగా 600 కోట్లకు పైగా గ్రాస్ ను….

సొంతం చేసుకుని మాస్ ఊచకోత కోయగా ఆ సినిమా తర్వాత ఇప్పుడు విజయ్ చేస్తున్న లేటెస్ట్ మూవీ అయిన గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం(G.O.A.T Movie) ఆడియన్స్ ముందుకు మరో నెలలో రిలీజ్ కాబోతూ ఉండగా సినిమా నుండి ఇప్పటి వరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ మొత్తం మీద…

బిలో పార్ అనిపించే లెవల్ లో ఉంది…ఇక సంగీతం విషయానికి వస్తే ఇప్పటి వరకు 3 పాటలు రిలీజ్ చేయగా ఒక్క పాట కూడా అనుకున్న రేంజ్ లో రెస్పాన్స్ ను అందుకోలేదు. విజయ్ రీసెంట్ మూవీస్ కి అనిరుద్ మైండ్ బ్లోయింగ్ మ్యూజిక్ అందించడంతో సినిమా మీద హైప్ ఓ రేంజ్ లో పెరిగేది…

కానీ గోట్ మూవీ విషయానికి వచ్చే సరికి మాత్రం యువన్ శంకర్ రాజా అందించిన సాంగ్స్ ఏమాత్రం కిక్ ఇవ్వడం లేదు. ఇక లేటెస్ట్ గా సినిమా నుండి మూడో సాంగ్ అయిన స్పార్క్ సాంగ్ రిలీజ్ అవ్వగా పాట యావరేజ్ గా ఉన్నా కూడా విజయ్ ఏజ్ తగ్గించి చేసిన గ్రాఫిక్స్ లుక్స్ సోషల్ మీడియాలో…

ఓ రేంజ్ లో ట్రోల్ కి కారణం ఆయ్యాయి ఇప్పుడు. సాంగ్ యావరేజ్ గా ఉండటం, విజయ్ డీ ఏజ్ లుక్ ఏమాత్రం సెట్ అవ్వకపోవడంతో సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోల్స్ పడుతూ ఉండగా రీసెంట్ టైంలో విజయ్ సినిమాల పాటలకు సెన్సేషనల్ రెస్పాన్స్ 24 గంటల్లో సొంతం అయ్యేది..కానీ…

గోట్ సాంగ్స్ చాలా నీరసమైన రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటూ ఉండగా స్పార్క్ సాంగ్ కి 24 గంటల్లో కేవలం 5.8 మిలియన్ వ్యూస్ మాత్రమే సొంతం అవ్వగా 423K లైక్స్ ను అందుకుని బిలో పార్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది. విజయ్ ప్రీవియస్ మూవీస్ రికార్డులతో పోల్చితే ఇది చాలా సాదారణమైన రెస్పాన్స్ అని చెప్పాలి. ఇక ట్రైలర్ ఒక్కటే సినిమాను కాపాడే అవకాశం ఉంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here