టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆచార్య లాంటి డిసాస్టర్ తర్వాత ఆడియన్స్ ముందుకు వస్తున్న సినిమా గాడ్ ఫాదర్…. ఈ సారి బాలీవుడ్ నుండి సల్మాన్ ఖాన్ స్పెషల్ రోల్ లో నటిస్తున్న ఈ సినిమా రిలీజ్ కి టైం దగ్గర పడగా ప్రమోషన్స్ పరంగా టీం అనుకున్న రేంజ్ లో సినిమాను ఇంకా ప్రమోట్ చేయలేదు. సినిమా బిజినెస్ కూడా ఇప్పుడిప్పుడే జోరు అందుకుంటూ ఉండగా సినిమా ఓవరాల్ గా ఇప్పుడు…
నాన్ థియేట్రికల్ బిజినెస్ విషయంలో మాత్రం జోరు చూపిస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. అందులో భాగంగా సినిమా డిజిటల్ రైట్స్ తెలుగు మరియు హిందీ కలిపి సెన్సేషనల్ రేటు ను సొంతం చేసుకున్నట్లు సమాచారం…. టాలీవుడ్ అండ్ బాలీవుడ్ మెగాస్టార్ లు కలిసి…
నటించిన సినిమా అవ్వడంతో బజ్ ఎలా ఉన్నప్పటికీ కూడా వ్యూవర్ షిప్ మాత్రం ఎక్స్ లెంట్ గా ఉండే అవకాశం ఉండటంతో నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఏకంగా 57 కోట్ల మమ్మోత్ రేటు చెల్లించి సినిమా రెండు భాషల హక్కులను సొంతం చేసుకున్నారని సమాచారం. ఓన్లీ తెలుగు అయితే రేటు తగ్గేది ఏమో కానీ…
సల్మాన్ ఖాన్ కూడా ఉండటంతో హిందీ ఆడియన్స్ లో వ్యూవర్ షిప్ మరో లెవల్ లో ఉండే అవకాశం ఉండటంతో ఈ రేంజ్ రేటు చెల్లించి డిజిటల్ రైట్స్ హక్కులను నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు సమాచారం…. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా ఎలాంటి బిజినెస్ ను సొంతం చేసుకుంటుంది ఎలాంటి కలెక్షన్స్ ని సాధిస్తుంది అన్నది అందరిలోనూ ఆసక్తిని రేపుతున్న ప్రశ్నగా చెప్పుకోవాలి ఇప్పుడు…
రీసెంట్ గా సినిమాలోని మొదటి సాంగ్ ను ఎట్టకేలకు రిలీజ్ చేయగా సాంగ్ కి ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ వినిపిస్తుంది, చిరు సల్మాన్ లు కలిసి వేసిన స్టెప్స్ తమన్ మ్యూజిక్ అందరినీ ఆకట్టుకుంటూ ఉండటంతో మిగిలిన ప్రమోషన్స్ కూడా ఇదే రేంజ్ లో అందరినీ ఇంప్రెస్ చేస్తే ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.