రీసెంట్ గా తమిళ్ లో రిలీజ్ అయిన జయం రవి(Jayam Ravi) నయనతార(Nayantara) ల కాంబినేషన్ లో ఆడియన్స్ ముందుకు వచ్చిన గాడ్(God Movie) తెలుగు లో డబ్ అయ్యి రీసెంట్ గా రిలీజ్ అయింది. మరి సినిమా ఎంతవరకు తెలుగు లో ఆడియన్స్ ను మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…
కథ పాయింట్ కి వస్తే సిటీలో అమ్మాయిలను అత్యంత దారుణంగా చంపే ఒక సైకో కిల్లర్ ను హీరో ఎలా పట్టుకున్నాడు, ఆ సైకో ఎందుకని అంత క్రూరంగా చంపుతున్నాడు. ఆ సైకో వలన హీరో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది అసలు కథ…. రెగ్యులర్ సైకో థ్రిల్లర్ మూవీస్ లో ఉండే కథతోనే…
తెరకెక్కిన ఈ సినిమా ఓవరాల్ గా చాలా రెగ్యులర్ సైకో కథగా రాగా కొన్ని సీన్స్ వరకు మంచి స్క్రీన్ ప్లే తో ఆకట్టుకున్నా కూడా చాలా వరకు కథ నత్తనడకన సాగడం, చాలా సీన్స్ సాగదీసినట్లు అనిపించడం, హీరో కూడా తను చేయడానికి ఏం లేదు అన్నట్లు సినిమాలో చూపించడం….
అసలు సైకో కిల్లర్ మోటో ఏంటి, ఎందుకు అంత క్రూరంగా చంపుతున్నాడు అన్నది క్లారిటీగా చెప్పక పోవడం ఇలా చాలా మైనస్ లే సినిమాలో ఉన్నాయి, కానీ కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మెప్పించాగా కొన్ని చోట ఆసక్తిని క్రియేట్ చేశాడు…
కానీ ఓవరాల్ గా మేజర్ పోర్షన్ కథ స్లో గా సాగడంతో సినిమా అంచనాలను అందుకోలేదు, జయం రవి జస్ట్ ఓకే అనిపించగా నయనతార రోల్ కూడా పెద్దగా ఏం లేదు, విలన్ తన రోల్ వరకు అదరగొట్టాడు కానీ తన ఫ్లాష్ బ్యాక్ పవర్ ఫుల్ గా లేదు….
సైకో థ్రిల్లర్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ చాలా ఓపికతో చూస్తె గాడ్ మూవీ ఒకసారి చూడొచ్చు అనిపించవచ్చు, మరీ ఎక్కువ అంచనాలు పెట్టుకుని థియేటర్స్ కి వెళితే మాత్రం సినిమా నిరాశ పరిచే అవకాశం ఎక్కువ గా ఉంటుంది. ఓవరాల్ గా సినిమాకి మా రేటింగ్ 2.25 స్టార్స్…