Home న్యూస్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి-భజే వాయు వేగం-గం గణేశ…అడ్వాన్స్ బుకింగ్స్….ఏ సినిమా లీడ్ లో ఉందంటే!!

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి-భజే వాయు వేగం-గం గణేశ…అడ్వాన్స్ బుకింగ్స్….ఏ సినిమా లీడ్ లో ఉందంటే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర ఎట్టకేలకు ఎంతో కొంత నోటబుల్ మూవీస్ తో ఈ వీకెండ్ నుండి టాలీవుడ్ తిరిగి జోరు చూపించడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ వీకెండ్ లో ఆడియన్స్ ముందుకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి(Gangs Of Godavari Movie), గం గం గణేశా(Gam Gam Ganesha Movie) మరియు భజే వాయు వేగం(Bhaje Vaayu Vegam Movie) సినిమాలు రిలీజ్ కానుండగా….

మూడు సినిమాలు ఎంతో కొంత ప్రామిసింగానే అనిపిస్తూ ఉండగా మూడు సినిమాల అడ్వాన్స్ బుకింగ్స్ రీసెంట్ గా ఓపెన్ అవ్వగా మూడు సినిమాల బుకింగ్స్ మెల్లిమెల్లిగానే జోరు అందుకుంటూ ఉన్నాయి…మూడు సినిమాలలో గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా బుకింగ్స్ లో జోరు చూపిస్తూ ఉండగా మిగిలిన రెండు సినిమాల బుకింగ్స్ బిలో పార్ గానే ఉన్నాయి.

దాంతో గం గం గణేశ మరియు భజే వాయు వేగం సినిమాలు ఎక్కువగా మౌత్ టాక్ నే నమ్ముకుని రిలీజ్ అవుతున్నాయి. ఇక గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కి నైజాంలో పర్వాలేదు అనిపించేలా బుకింగ్స్ ఉండగా ఆంధ్ర సీడెడ్ లలో బుకింగ్స్ మెల్లి మెల్లిగా పుంజుకుంటున్నాయి. మొత్తం మీద ఈ సినిమాకి టాక్ బాగుంటే ప్రజెంట్ జోరుని బట్టి చూస్తూ ఉంటే…

తొలిరోజు 2.2-2.5 కోట్ల రేంజ్ లో ఓపెనింగ్స్ ను మిగిలిన రెండు సినిమా 60-80 లక్షల రేంజ్ లో ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉంది. మూడు సినిమాల మౌత్ టాక్ ను బట్టి కలెక్షన్స్ షో షోకి పెరిగే అవకాశం ఉంది. చాలా టైం తర్వాత టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ఈ వీకెండ్ లో కొంచం జోరు చూపించే అవకాశం ఉంది. మరి ఈ సినిమాలలో ఈ వీకెండ్ విన్నర్ గా ఏ సినిమా నిలుస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here