Home న్యూస్ అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ టీసర్ రివ్యూ….ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడు!!

అజిత్ కుమార్ గుడ్ బ్యాడ్ అగ్లీ టీసర్ రివ్యూ….ఈ సారి బ్లాక్ బస్టర్ కొట్టేలా ఉన్నాడు!!

0

కోలివుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన అజిత్ కుమార్(Ajith Kumar) నటించిన రీసెంట్ మూవీస్ ఏవి కూడా పెద్దగా అంచనాలను అందుకోలేక పోయాయి, రీసెంట్ గా చేసిన పట్టుదల మూవీ కేవలం అజిత్ కుమార్ స్టార్ డం మీద కొంచం కలెక్షన్స్ ని సాధించినా డెడ్ జీరో బజ్ తో వచ్చిన సినిమా మినిమమ్ ఇంపాక్ట్ ను చూపించలేక పోయింది…

ఇలాంటి టైంలో ఆడియన్స్ ముందుకు అజిత్ కుమార్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly Movie) ఆడియన్స్ ముందుకు ఈ సమ్మర్ కానుకగా ఏప్రిల్ 10న రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. కాగా ఈ సినిమా మీద అంచనాలు సాలిడ్ గానే ఉండగా…

సినిమా ఎలా ఉంటుందో, అజిత్ సినిమాలో ఎలా ఉంటారో అని అందరిలోనూ ఆసక్తి మరో లెవల్ లో ఉండగా రీసెంట్ గా సినిమా అఫీషియల్ టీసర్ ను రిలీజ్ చేయగా ఫ్యాన్స్ లో మాత్రం ఖుషి మరో లెవల్ లో రెట్టింపు అయ్యింది అని చెప్పాలి ఇప్పుడు….

సినిమాలో మూడు డిఫెరెంట్ షేడ్స్ లో అజిత్ కుమార్ కనిపించబోతూ ఉండగా, కొన్ని సీన్స్ లో వింటేజ్ అజిత్ కుమార్ ను చూపించిన విధానం, ఓవరాల్ గా టీసర్ క్వాలిటీ నెక్స్ట్ లెవల్ లో ఉండటం…అన్నింటికీ మించి అజిత్ కుమార్ లుక్స్ అండ్ మ్యానరిజమ్స్…

డైలాగ్స్ ఓ రేంజ్ లో టీసర్ లో హైలెట్ అవ్వడంతో సినిమా మీద అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయేలా చేసింది సినిమా…బాక్స్ ఆఫీస్ దగ్గర ఇదే రేంజ్ లో టాక్ ను సొంతం చేసుకున్నా కూడా ఓ రేంజ్ లో ఇంపాక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర కనిపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి…

రీసెంట్ టైంలో అజిత్ కుమార్ నుండి వచ్చిన టీసర్ లలో బెస్ట్ కట్ అని చెప్పొచ్చు. త్వరలోనే తెలుగు వర్షన్ టీసర్ కూడా రిలీజ్ కానుండగా….ఇక్కడ కూడా సినిమా వర్కౌట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇక టీసర్ కి 24 గంటల్లో ఓవరాల్ గా ఏ రేంజ్ లో రెస్పాన్స్ సొంతం అవుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here