Home న్యూస్ 3 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమా…ఇప్పుడొస్తుంది!!

3 ఏళ్ల క్రితం ఆగిపోయిన సినిమా…ఇప్పుడొస్తుంది!!

1035
0

టాలీవుడ్ లో మంచి టాలెంట్ ఉండి మాస్ హీరో గా సెటిల్ అవ్వగల కెపాసిటీ ఉండీ సరైన సినిమా లు ఇప్పుడు పడక మార్కెట్ మొత్తం కోల్పోయిన హీరోల లో గోపీచంద్ కూడా ఒకరు, కెరీర్ ని విలన్ గా అద్బుతంగా మొదలు పెట్టి తర్వాత హీరో గా కూడా అద్బుతంగా రాణించి దుమ్ము లేపిన గోపీచంద్ మధ్య లో ఒకసారి గాడి తప్పినా బాక్స్ ఆఫీస్ దగ్గర 2014 టైం లో….

లౌక్యం, సాహసం సినిమా లతో మళ్ళీ గాడిలో పడ్డాడు, ఇక మళ్ళీ పుంజుకుంటాడు అనుకున్న టైం లో వరుస పరాజాయాలతో తన మార్కెట్ భారీ గా డౌన్ ఫాల్ అవుతూ రాగా కొన్ని మంచి సినిమా లు కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ అవ్వాల్సినవి ఫ్లాఫ్ అయ్యాయి.

ఇక మధ్యలో ఒక సినిమా అయితే రిలీజ్ కి కూడా నోచుకోకుండా ఇప్పటి వరకు లాబ్స్ లోనే ఉంది. ఎప్పుడో గోపీచంద్ బి గోపాల్ మరియు నయనతార ల కాంబినేషన్ లో మొదలు అయిన “ఆరడుగుల బులెట్” సినిమా చాలా గ్యాప్ తర్వాత 2017 సమ్మర్ లో రిలీజ్ కి సిద్ధం అయినట్లే అయ్యి ఆగిపోయింది.

మళ్ళీ మూడేళ్ళుగా సైలెంట్ అయిపోయిన ఈ సినిమా ఇప్పుడు రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది, థియేటర్స్ లో కాదు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ ని ఈ సినిమా సొంతం చేసుకోబోతుందని సమాచారం. నిర్మాత కి మంచి ఫ్యాన్సీ రేటు ఆఫర్ చేసిన OTT యాప్స్ త్వరలోనే సినిమాను డిజిటల్ రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాయి.

బి గోపాల్ అంటే మాస్ లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ ఫైనాన్స్ ప్రాబ్లంస్ వలన ఈ సినిమా ఎప్పటి కప్పుడు రిలీజ్ ఆగిపోగా ఇప్పుడు దాదాపు మూడేళ్ళ తర్వాత ప్రేక్షకుల ముందుకు డిజిటల్ రిలీజ్ గా రాబోతుంది, ఇక గోపీచంద్ నటిస్తున్న కొత్త సినిమా సీటిమార్ ఈ ఇయర్ లోనే థియేటర్స్ లో రిలీజ్ అవుతుందని సమాచారం…మరి ఈ సినిమా తో అయినా గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ కొడతాడో లేదో చూడాలి…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here