Home గాసిప్స్ ఇది మాములు షాక్ కాదు…15 కోట్ల సినిమా …..ఈ రేటు ఏంటి సామి!!

ఇది మాములు షాక్ కాదు…15 కోట్ల సినిమా …..ఈ రేటు ఏంటి సామి!!

1628
0

టాలీవుడ్ యాక్షన్ హీరో గోపీచంద్ కి ఈ మధ్య టైం అస్సలు కలిసి రావడం లేదన్న విషయం అందరికీ తెలిసిందే, చేసిన సినిమా చేసినట్లు బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాఫ్ అవుతూ వస్తుండగా రీసెంట్ టైం లో బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది గోపీచంద్ కి… 2014 లో లౌక్యం సినిమా తో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు కూడా…

హిట్ కొట్టలేక పోయాడు, కానీ ఈ మధ్య లో చేసిన సినిమా చేసినట్లు ఆడియన్స్ ముందుకు వచ్చినా కానీ 3 ఏళ్ల క్రితం రిలీజ్ అవ్వాల్సిన గోపీచంద్ నటించిన ఆరడుగుల బులెట్ సినిమా మాత్రం ఇప్పటి వరకు రిలీజ్ కి నోచుకోలేక పోయింది. ఇండస్ట్రీ హిట్లు కొట్టిన డైరెక్టర్…

బి గోపాల్ డైరెక్షన్ లో నయనతార హీరోయిన్ గా నటించిన సినిమా కంప్లీట్ ఎప్పుడో అయిపోయినా కానీ అనేక అవరోధాల నడుమ రిలీజ్ కి నోచుకోని ఈ సినిమా సుమారు 15 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందగా సినిమాను రీసెంట్ గా డైరెక్ట్ రిలీజ్ కోసం ట్రై చేశారు కానీ రేట్లు అనుకున్న విధంగా రావడం లేదు.

ఉన్నంతలో 6-7 కోట్ల రేంజ్ రేటు వచ్చినా అప్పుడు నిర్మాతలు సై అనలేదు, దాంతో రేట్లు మళ్ళీ తగ్గుముఖం పట్టి ఇప్పుడు 4 కోట్ల రేంజ్ కి సినిమాను కొంటామని ముందుకు వస్తున్నారట, మరి కొందరు పే పెర్ వ్యూ పద్దతిలో రిలీజ్ చేద్దామని ఆఫర్స్ ఇస్తున్నారట. కానీ అవేవి కూడా సినిమా బడ్జెట్ కి….

అలాగే సినిమా కోసం తెచ్చిన ఫైనాన్స్ డబ్బుల వడ్డీలు కలిపి చూస్తె అసలు ఏమాత్రం మ్యాచ్ అయ్యేలా లేక పోవడం తో ఈ సినిమాను ఫైనల్ గా ఏం చేయాలో తెలియని పరిస్థితి లో యూనిట్ ఉన్నట్లు తెలుస్తుంది…. హీరో గోపీచంద్ కూడా ఇక ఈ సినిమాను మర్చిపోయి సీటిమార్ తో పాటు కొత్త సినిమాలతో బిజీ అయ్యాడు, మరి ఫైనల్ గా ఈ సినిమా పరిస్థితి ఏమవుతుందో చూడాలి మరి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here