Home న్యూస్ చాణక్య ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

చాణక్య ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

2161
0

     యాక్షన్ హీరో గోపీచంద్ మేహ్రీన్ ల కాంబినేషన్ లో తమిళ్ డైరెక్టర్ తిరు డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ చాణక్య. బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా కాలంగా నికార్సయిన హిట్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్ ఈ సినిమా పై భారీ ఆశలే పెట్టుకున్నాడు. భారీ అంచనాల నడుమ నేడు సినిమా వరల్డ్ వైడ్ గా 650 వరకు థియేటర్స్ లో రిలీజ్ అవ్వగా ముందుగా ఓవర్సీస్ ప్రీమియర్ షోలను పూర్తీ చేసుకుంది.

అక్కడ నుండి వినిపిస్తున్న టాక్ ప్రకారం సినిమా రా ఏజెంట్ స్పై థ్రిల్లర్ స్టొరీ అని అంటున్నారు, సినిమా కథ పాయింట్ లో కొన్ని ఆసక్తి కరమైన ములుపులు ఉంటాయని అవి రివీల్ చేస్తే బాగోదని అంటున్నారు. గోపీచంద్ నటన ఆకట్టుకుందని, స్పై ఏజెంట్ గా… బ్యాంక్ ఉద్యోగిగా డిఫెరెంట్…

షేడ్స్ ఉన్న రోల్ లో గోపీచంద్ ఆకట్టుకున్నాడని అంటున్నారు, యాక్షన్ సీన్స్ అదరగోట్టాడని అంటున్నారు. ఇక హీరోయిన్ మేహ్రీన్ ది చిన్న రోలే అయినా ఆకట్టుకుందని, బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ కూడా చిన్న రోల్ లో మెప్పించిందని అంటున్నారు.

సంగీతం యావరేజ్ గా ఉన్న బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుందని, యాక్షన్ సీన్స్ లో ఆ బ్యాగ్రౌండ్ స్కోర్ మరింత మెప్పించిందని అంటున్నారు. ఇక ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫ్లాట్ గా ఉన్నాయని, ఆల్ రెడి వచ్చిన కొన్ని రా ఏజెంట్ స్పై థ్రిల్లర్ స్టొరీ లను కొంచం మార్చి తీర్చినట్లు అనిపించింది అని అంటున్నారు.

స్క్రీన్ ప్లే తో అవి మరిపించారా అంటే అదీ లేదని, తర్వాత సీన్ ఇట్టే తెలిసి పోయేలా చాలా సీన్స్ ఉన్నాయని అంటున్నారు. అది మేజర్ మైనస్ కాగా లెంత్ కూడా ఎక్కువ అయిన ఫీలింగ్ కలిగిందని, అవి తప్పితే సినిమా బెటర్ గా నే అనిపించింది అని అంటున్నారు.

ఇక డైరెక్షన్ పరంగా తిరు మరీ కొత్త కథ కాకున్నా ఏకంగా 30 కోట్ల కి పైగా భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ సినిమా విజువల్స్, గ్రాండియర్ యాక్షన్ సీన్స్ లోకేషన్స్ ఇలా అన్ని చోట్లా పెట్టిన బడ్జెట్ కనిపించినా అవి పూర్తిగా ఆకట్టుకునే లేవు అంటున్నారు. మొత్తం మీద చాణక్య సినిమా కి…

మరీ అద్బుతం కాదు కానీ ఎబో యావరేజ్ రేంజ్ మూవీ అని, రీసెంట్ టైం లో గోపీచంద్ నుండి వచ్చిన సినిమాల్లో బెస్ట్ క్వాలిటీ అండ్ యాక్షన్ సీన్స్ ఉన్న సినిమా ఇదే అని అంటున్నారు. ఫైనల్ గా చాణక్య సినిమా కి ఓవర్సీస్ ఆడియన్స్ నుండి వినిపిస్తున్న టాక్ కూడా..

ఎబో యావరేజ్ రేంజ్ లో ఉందని చెప్పాలి. ఇక రెగ్యులర్ షోలకు సినిమా ఇదే రేంజ్ లో టాక్ ని సొంతం చేసుకుంటుందా లేదా బెటర్ టాక్ ని సొంతం చేసుకుంటుందో చూడాలి. అక్కడ నుండి లాస్ట్ గా వినిపిస్తున్న టాక్ గోపీచంద్ రీసెంట్ మూవీస్ లో మంచి సినిమా ఇదే అని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here