Home TRP రేటింగ్ చాణక్య: అమ్మింది 4 కోట్లు…TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

చాణక్య: అమ్మింది 4 కోట్లు…TRP రేటింగ్ తెలిస్తే షాక్!!

3975
0

     టాలీవుడ్ లో ఉన్న హీరోల్లో ప్రస్తుతం విజయం కోసం ఎదురు చూస్తున్న హీరోల్లో గోపీచంద్ ఒకరు, లౌక్యం తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ కంబ్యాక ఇవ్వలేక పోతున్నాడు గోపీచంద్. ఈ ఇయర్ దసరా టైం లో మెగాస్టార్ చిరంజీవి…

ప్రతిష్టాత్మక సినిమా సైరా నరసింహా రెడ్డి తో పోటి లో దిగిన చాణక్య సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనిపించుకునే టాక్ ని దక్కించుకున్నా కలెక్షన్స్ లేక భారీ డిసాస్టర్ గా పరుగును పూర్తీ చేసుకుంది, సినిమా పెట్టిన బడ్జెట్ లో 10 వ వంతు కూడా కలెక్ట్ చేయలేక పోయింది ఈ సినిమా.

అలాంటి ఈ సినిమా ను స్టార్ మా వారు ఏకంగా 4 కోట్లకు పైగా రేటు చెల్లించి శాటిలైట్ రైట్స్ హక్కులను సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా సినిమాను టెలికాస్ట్ చేయగా తొలిసారి TRP రేటింగ్ కూడా డిసాస్టర్ రిజల్ట్ నే సొంతం చేసుకుందని చెప్పొచ్చు.

ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన చాణక్య సినిమా కి కేవలం 6.1 TRP రేటింగ్ మాత్రమె దక్కినట్లు సమాచారం. కొత్త సినిమా కి ఇంత తక్కువ TRP రేటింగ్ అంటే సినిమా డిసాస్టర్ అయిందనే చెప్పాలి. కానీ టెలివిజన్ లో రీసెంట్ టైం లో కొన్ని సినిమాలు మాత్రమె డీసెంట్ TRP రేటింగ్ లను సొంతం చేసుకుంటున్నాయి.

అటు బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇవ్వలేక ఇటు బుల్లితెరపై కూడా మెప్పించలేక పోతున్న గోపీచంద్ ఇప్పుడు తన ఆశలన్నీ సంపత్ నంది డైరెక్షన్ లో చేస్తున్న అప్ కమింగ్ స్పోర్ట్స్ డ్రామా పైనే పెట్టుకున్నాడు, తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా తో అయినా గోపీచంద్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here