బాక్స్ ఆఫీస్ దగ్గర మాస్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో ఫాలోయింగ్ ను ఇప్పటికీ సొంతం చేసుకున్నా కూడా సరైన హిట్స్ ను సొంతం చేసుకోలేక చాలా టైంగా హిట్ కి దూరంగా ఉన్న టాలీవుడ్ మాచో మాన్ గోపీచంద్(Gopichand) రీసెంట్ గా ఆడియన్స్ ముందుకు శ్రీను వైట్లతో కలిసి చేసిన విశ్వం(Vishwam Movie) తో రాగా…
మిక్సుడ్ రెస్పాన్స్ ను ఆడియన్స్ నుండి సొంతం చేసుకున్నా కూడా లాంగ్ రన్ లో పర్వాలేదు అనిపించే రేంజ్ లో రిజల్ట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత కొత్త కథని ఎంచుకోవడానికి టైం తీసుకుంటున్నాడు గోపీచంద్…ఆడియన్స్ గోపీచంద్ నుండి ఒకప్పటిలా…సాహసం….
ఒక్కడున్నాడు, గౌతమ్ నంద లాంటి సినిమాలు ఎక్స్ పెర్ట్ చేస్తూ ఉండగా రీసెంట్ టైంలో అన్నీ మాస్ కమర్షియల్ మూవీస్ చేస్తున్న గోపీచంద్ ఇప్పుడు ఓ బిగ్ ఎక్స్ పెరిమెంట్ చేయడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం….టాలీవుడ్ లో ఘాజి….అంతరిక్షం, లాంటి బిగ్ ఎక్స్ పెరిమెంట్ మూవీస్ చేసి….
మంచి పేరు తెచ్చుకున్న సంకల్ప్ రెడ్డి డైరెక్షన్ లో ఓ ఎక్స్ పెరిమెంట్ మూవీ కథని గోపీచంద్ విన్నట్లు టాక్ వినిపిస్తుంది…ప్రస్తుతం రాదేశ్యాం ఫేమ్ క్రిష్ డైరెక్షన్ లో ఒక సినిమా ఒప్పుకున్నా గోపీచంద్…ఆ సినిమా తో పాటు ఈ కథని కూడా ఓకే చేసినట్లు తెలుస్తుంది…
ఈ కథ ఒకప్పుడు గోపీచంద్ చేసిన సాహసం, ఒక్కడున్నాడు టైప్ కథగా ఉంటుంది అని అంటున్నారు….ఎప్పటి నుండో మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న గోపీచంద్, ఇప్పుడు కథల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుంటూ ఉండటంతో 10 ఏళ్ల నుండి ఎదురు చూస్తున్న ఓ భారీ హిట్ ఈ సినిమాలతో అయినా సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి…