Home గాసిప్స్ వకీల్ సాబ్ రెస్పాన్స్ కి గోపీచంద్ ఫుల్ ఖుష్….రీజన్ ఇదే!

వకీల్ సాబ్ రెస్పాన్స్ కి గోపీచంద్ ఫుల్ ఖుష్….రీజన్ ఇదే!

2628
1

మాచో హీరో గోపీచంద్ బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలమే అవుతుంది, కెరీర్ లో లౌక్యం సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ ని ఎప్పుడో 7 ఏళ్ల క్రితం సొంతం చేసుకున్న గోపీచంద్ తర్వాత మళ్ళీ ఇప్పటి వరకు క్లీన్ హిట్ ని అందుకోలేక పోయాడు… ఇలాంటి టైం లో ఇప్పుడు వకీల్ సాబ్ కి వచ్చిన ఆడియన్స్ రెస్పాన్స్ గోపీచంద్ కి కూడా ఫుల్ బూస్టప్ ఇచ్చిందని టాలీవుడ్ లేటెస్ట్ న్యూస్…

దానికి ఒక కారణం కూడా ఉందని టాలీవుడ్ లో చెప్పుకుంటున్నారు, అదేంటే ప్రస్తుతం గోపీచంద్ సంపత్ నంది డైరెక్షన్ లో సీటి మార్ సినిమా చేస్తుండగా ఈ సినిమా ను ఆల్ మోస్ట్ పూర్తీ చేసి అప్ కమింగ్ మూవీ మారుతి డైరెక్షన్ లో పక్కా కమర్షియల్ అంటూ…

టైటిల్ తో చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా స్టొరీ పాయింట్ కూడా వకీల్ సాబ్ లానే ఉంటుంది.. కానీ దానికి కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా జోడించి ఉంటాయి. హిందీ లో అక్షయ్ కుమార్ హీరోగా చేసిన జాలీ LLB సీక్వెల్ సినిమా రీమేక్ గా గోపీచంద్ పక్కా కమర్షియల్ సినిమా…

రూపొందుతుంది… రీమేక్ అయినా కానీ కొన్ని మార్పులు చేర్పులు చేశారట, అయినా ఎక్కువ శాతం కోర్టు డ్రామా గా రూపొందిన ఈ సినిమా ఆడియన్స్ ను ఎంతవరకు మెప్పిస్తుంది అంటూ మారుతి కొంచం డౌట్ పడి ఇప్పుడు వకీల్ సాబ్ రెస్పాన్స్ తో సినిమాలో మరికొన్ని మార్పులు చేర్పులు కూడా ధైర్యంగా చేస్తున్నాడని దానికి గోపీచంద్ కూడా ఒప్పుకున్నాడని అంటున్నారు.

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న నేపధ్యంలో వకీల్ సాబ్ లానే ఈ సినిమా కూడా రెస్పాన్స్ తెచ్చుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ఇవ్వొచ్చని ఆశగా ఉన్నాడట గోపీచంద్, ఫస్ట్ సీటిమార్ తర్వాత పక్కా కమర్షియల్ సినిమాతో బాక్ టు బాక్ ఆడియన్స్ ముందుకు రానున్న గోపీచంద్ ఎలాంటి కంబ్యాక్ ని సొంతం చేసుకుంటాడో చూడాలి ఇక.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here