చాలా కాలంగా హిట్ కి దూరంగా ఉన్న మాచో స్టార్ గోపీచంద్(Gopichand) శ్రీనువైట్ల ల కాంబోలో ఆడియన్స్ ముందుకు వచ్చిన లేటెస్ట్ మూవీ అయిన విశ్వం(Viswam Movie) రొటీన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కి ఆడియన్స్ నుండి కూడా జస్ట్ ఓకే అనిపించే టాక్ ను సొంతం చేసుకోగా దసరా టైంలో స్లోగానే ఉన్నా కూడా తర్వాత మాత్రం…
పర్వాలేదు అనిపించేలా హోల్డ్ ని చూపెడుతూ ఆల్ మోస్ట్ 80% వరకు రికవరీని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది. కానీ సినిమా సాధించిన కలెక్షన్స్ సినిమా బడ్జెట్ దృశ్యా పెద్దగా ఇంపాక్ట్ ని ఏమి క్రియేట్ చేయలేక పోయింది అనే చెప్పాలి. ఇటు శ్రీనువైట్ల కానీ…
అటు గోపీచంద్ కానీ వరుస ఫ్లాఫ్స్ లోనే ఉండటంతో ఈ సినిమా బడ్జెట్ పరంగా ముందు తక్కువ బడ్జెట్ తోనే తెరకెక్కించాలి అని ప్లాన్ చేశారు. కానీ సినిమా షూటింగ్ టైంలో ఔట్ పుట్ బాగా రావాలని బడ్జెట్ పెరిగి ఓవరాల్ గా తర్వాత ఎస్టిమేట్ వేసుకున్న బడ్జెట్ లోనే…
సినిమా పూర్తి అయినా అది ఇటు శ్రీనువైట్ల అటు గోపీచంద్ ప్రజెంట్ మార్కెట్ రేంజ్ కన్నా కూడా ఎక్కువే అయిందని సమాచారం. ముందు 15 కోట్ల రేంజ్ బడ్జెట్ లో రూపొందాలి అనుకున్న సినిమా ఓవరాల్ గా పూర్తి అయ్యే టైంకి మొత్తం మీద పబ్లిసిటీ అండ్ ప్రింట్ ఖర్చులతో…
కలిపి అటూ ఇటూగా 27 కోట్ల దాకా అయ్యిందని ట్రేడ్ వర్గాల అంచనా…బాక్స్ ఆఫీస్ దగ్గర అటూ ఇటూగా 8 కోట్ల దాకా రికవరీ చేసిన ఈ సినిమా ఇంకా నాన్ థియేట్రికల్ లెక్కలు శాటిలైట్ అండ్ మ్యూజిక్ రైట్స్ లెక్కలు క్లియర్ గా రివీల్ అవ్వాల్సి ఉంది…మరి ఓవరాల్ గా …
పెట్టిన డబ్బు మీద పర్వాలేదు అనిపించేలా రికవరీని అయితే సినిమా సొంతం చేసుకుని ఉండొచ్చు కానీ, కథని మరింత జాగ్రత్తగా తీసి ఉంటే కచ్చితంగా గోపీచంద్ కి బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా మంచి కంబ్యాక్ మూవీగా నిలిచి ఉండేది అని చెప్పొచ్చు.