బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా కాలం అవుతున్న హీరోలలో ఒకరైన మాచో స్టార్ గోపీచంద్(Gopichand) లాస్ట్ హిట్ కొట్టి ఆల్ మోస్ట్ 10 ఏళ్ళు అవుతుంది…10 ఏళ్ల క్రితం బాక్స్ ఆఫీస్ దగ్గర లౌక్యం మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్న గోపీచంద్ తర్వాత టైంలో ఒక్క సారి కూడా క్లీన్ హిట్ మార్క్ ని…
అందుకోలేక పోయాడు. మధ్య లో కొన్ని సినిమాలు పర్వాలేదు అనిపించినా కూడా క్లీన్ హిట్ అవ్వలేదు…రీసెంట్ టైంలో మరింతగా సినిమాలు నిరాశ పరుస్తూ ఉన్నా కూడా గోపీచంద్ కి మాస్ సెంటర్స్ లో ఇప్పటికీ డీసెంట్ మార్కెట్ ఉండటం అలాగే…
గోపీచంద్ OTT మార్కెట్ కూడా స్టడీగానే ఉండటంతో రెమ్యునరేషన్ పరంగా గోపీచంద్ ఫ్లాఫ్స్ లో ఉన్నా కూడా రెమ్యునరేషన్ పరంగా డీసెంట్ అమౌంట్ నే తీసుకుంటూ ఉండగా…రామ బాణం మరియు భీమా లాంటి మూవీస్ కి 5-5.5 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకోగా…
లేటెస్ట్ గా గోపీచంద్ చేసిన కొత్త సినిమా విశ్వం(Viswam Movie) శ్రీనువైట్ల డైరెక్షన్ లో చేయగా ముందుగా లో బడ్జెట్ లో సినిమాను తీయాలి అనుకున్నా కూడా తర్వాత బడ్జెట్ పెరిగిపోగా..27 కోట్ల రేంజ్ లో బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా కి గాను గోపీచంద్ కి…
ఓవరాల్ గా రెమ్యునరేషన్ పరంగా మరోసారి 5.5-6 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ వెళ్ళింది అని ఇండస్ట్రీలో టాక్ ఉంది…వరుస ఫ్లాఫ్స్ తో 10 ఏళ్ళు స్లో డౌన్ అయినా కూడా ఓవరాల్ గా గోపీచంద్ మార్కెట్ స్టడీగానే ఉన్నట్లు తెలుస్తూ ఉండటంతో….
రెమ్యునరేషన్ పరంగా ఇప్పటికీ మీడియం రేంజ్ హీరోల రేంజ్ కి ఏమాత్రం తీసిపోని విధంగానే గోపీచంద్ రెమ్యునరేషన్ కొనసాగుతూ ఉంది. ఇక గోపీచంద్ అప్ కమింగ్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర కంబ్యాక్ ను సొంతం చేసుకుంటే రెమ్యునరేషన్ పరంగా మరోసారి జోరు చూపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.