యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ మూవీ గల్లీ రౌడీ బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అయ్యి కలెక్షన్స్ కోసం కష్టపడుతూ ఉంది, సినిమా కి మొదటి రోజు కొన్ని చోట్ల మంచి ఓపెనింగ్స్ లభించినా కానీ ఓవరాల్ గా ఆంధ్రలో టికెట్ రేట్లు నార్మల్ గా లేక పోవడం లాంటివి సినిమా కలెక్షన్స్ పై గట్టి ఇంపాక్ట్ నే క్రియేట్ చేశాయి అని చెప్పాలి, అయినా కానీ ఉన్న పరిస్థితులలో కూడా…
పర్వాలేదు అనిపించే కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా బడ్జెట్ లెక్కలు టోటల్ బిజినెస్ లెక్కలు ఇప్పుడు బయటికి వచ్చాయి. చిన్న సినిమా అన్నారు కానీ సినిమా టోటల్ బడ్జెట్ లెక్క 7.5 కోట్ల దాకా వెళ్లిందని అంటున్నారు. ఇక సినిమా సాధించిన బిజినెస్ ను గమనిస్తే…
సినిమా థియేట్రికల్ బిజినెస్ 2.75 కోట్లు పలకగా నాన్ థియేట్రికల్ బిజినెస్ లో శాటిలైట్ రైట్స్ కి 2.25 కోట్లు, డిజిటల్ రైట్స్ కి 2.7 కోట్లు, హిందీ డబ్బింగ్ రైట్స్ కి 3.2 కోట్ల రేటు సొంతం అవ్వగా ఇతర భాషల డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ కింద 1.5 కోట్ల రేటు ని….
ఈ సినిమా సొంతం చేసుకుందని అంటున్నారు. దాంతో టోటల్ గా నాన్ థియేట్రికల్ బిజినెస్… 9.7 కోట్లు కాగా టోటల్ బిజినెస్ 12.45 కోట్ల బిజినెస్ ను సొంతం చేసుకుంది ఈ సినిమా.. అంటే బడ్జెట్ మీద ఆల్ మోస్ట్ 4.5 కోట్ల రేంజ్ లో ప్రాఫిట్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా తో సందీప్ కిషన్ హిట్స్ కొట్టకున్నా కానీ నిర్మాతకి సాలిడ్ ప్రాఫిట్స్ దక్కేలా చేశాడు.
ఇక బాక్స్ ఆఫీస్ దగ్గరే సినిమా ఇప్పుడు బ్రేక్ ఈవెన్ కోసం ఇంకా కష్టపడాల్సిన అవసరం ఉంది, ఈ ఇయర్ ఏ1 ఎక్స్ ప్రెస్ తోనే మంచి హిట్ కొట్టాల్సిన సందీప్ కిషన్ అప్పుడు జాతిరత్నాలు వలన హిట్ ని అందుకోలేదు, ఇప్పుడు వచ్చే వారం లవ్ స్టొరీ ఉంది… మరి ఈ లోపు ఎంత కుదిరితే అంత రికవరీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.