Home న్యూస్ గల్లీ రౌడీ మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

గల్లీ రౌడీ మూవీ రివ్యూ….హిట్టా-ఫట్టా!!

0

యంగ్ హీరో సందీప్ కిషన్ ఈ ఇయర్ ఏ1 ఎక్స్ ప్రెస్ తో మెప్పించినా క్లీన్ హిట్ ని అందుకోలేదు… ఇలాంటి టైం లో కమర్షియల్ హంగులతో గల్లీ రౌడీ అంటూ ఆడియన్స్ ముందుకు రీసెంట్ గా వచ్చాడు… సినిమా వరల్డ్ వైడ్ గా భారీ ఎత్తున రిలీజ్ చేయగా ప్రమోషన్స్ కూడా బాగానే చేశారు, ట్రైలర్ కి ఓ మాదిరి రెస్పాన్స్ ఆడియన్స్ నుండి వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం పదండీ…

కథ పాయింట్ కి వస్తే హీరో తాతని ఒక రౌడీ అవమానిస్తాడు, ఆ కోపంతో తన మనవడిని ఓ రౌడీ చేయాలనీ ఫిక్స్ అవుతాడు తాత, సాఫ్ట్ వేర్ అవ్వాలనుకున్న హీరో రౌడీగా ట్రైనింగ్ తీసుకోగా హీరోయిన్ ని చూసి ఇష్టపడి హీరోయిన్ ఫ్యామిలీ కి వచ్చిన ఓ సమస్యని సాల్వ్ చేయాలనీ డిసైడ్ అవుతాడు…

కానీ తర్వాత తన లైఫ్ ఆ హీరోయిన్ ఫ్యామిలీ లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అన్నది మొత్తం మీద సినిమా కథ పాయింట్… ఎప్పుడో 70,80’s టైం నాటి కథ పాయింట్ తో తెరకెక్కిన గల్లీ రౌడీ కథ పరంగా చూసుకుంటే ఏమాత్రం ఇంప్రెస్ చేయలేదు అనే చెప్పాలి.

కానీ సినిమా సిల్లీ కామెడీ సీన్స్ తో నిండిన సినిమా కాబట్టి ఆ పాయింట్ ఆఫ్ ఫ్యూ నుండి చూసి ఎంతవరకు ఎంటర్ టైన్ చేసిందా అంటే పార్టు పార్టులుగా ఎంటర్ టైన్ అయితే చేసింది అని చెప్పాలి, సందీప్ కిషన్ తన రోల్ లో బాగానే నటించాడు, హీరోయిన్ జస్ట్ ఓకే ఇక రాజేంద్రప్రసాద్, బాబీ సింహా ల రోల్స్ కూడా పర్వాలేదు…

ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే పరమ రొటీన్ అనిపించే విధంగా ఉండగా సంగీతం యావరేజ్ గా ఉంది, బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా జస్ట్ ఓకే…. డైలాగ్స్ పర్వాలేదు, కొన్ని సింగిల్ లైన్ డైలాగ్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది…సినిమాటోగ్రఫీ పర్వాలేదు, ప్రొడక్షన్ వాల్యూస్ యావరేజ్ గా ఉన్నాయి. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే…

నాగేశ్వరరెడ్డి చాలా సిల్లీ స్టొరీ లైన్ ని ఎంచుకుని ఎంటర్ టైన్ చేసే ప్రయత్నం చేసాడు కానీ కథలో దమ్ము లేకపోవడం తో కథ పరంగా సినిమా నిరాశ పరిచినా ఎంటర్ టైన్ పరంగా కొన్ని సీన్స్ బాగానే ఇంప్రెస్ చేశాయి, ఇంటర్వెల్ సీన్ హిలేరియస్ గా వర్కౌట్ అవ్వగా ఫస్టాఫ్ లో కొన్ని సీన్స్ బాగానే ఆకట్టుకున్నాయి కానే సెకెండ్ ఆఫ్ సినిమా ట్రాక్ తప్పింది…

కథ అయిపొయింది అనుకుంటే ఎటు నుండి ఏటో వెళుతూ ఇక ఎప్పుడు అయిపోతుంది అంటూ ఆడియన్స్ ఎదురు చూపులు చూసేలా ఉంటుంది సినిమా… కామెడీ ఎంటర్ టైనర్ లు ఇష్టపడే వాళ్ళకి యావరేజ్ అనిపిస్తుంది సినిమా. ఇక సినిమాలో కథ ఓ రేంజ్ లో ఉండాలి అనుకునే వాళ్ళు ఈ సినిమాకి దూరంగా ఉండొచ్చు… రొటీన్ మూవీస్ చూసే వాళ్ళకి యావరేజ్ గా అనిపిస్తుంది… ఓవరాల్ గా సినిమా కి మా రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here