Home గాసిప్స్ 120 కోట్ల సినిమా అట…ప్రీ ప్రొడక్షన్ కే ఈ రేటు ఏంటి సామి!

120 కోట్ల సినిమా అట…ప్రీ ప్రొడక్షన్ కే ఈ రేటు ఏంటి సామి!

631
0

బాహుబలి టైం లో అంతే రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకున్న సినిమా రుద్రమదేవి. గుణశేఖర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా కి కూడా భారీ హైప్ ఉన్నప్పటికీ టీసర్ ట్రైలర్ రిలీజ్ తర్వాత గ్రాఫిక్స్ కానీ కంటెంట్ కానీ అనుకున్న విధంగా లేక పోవడం తో మెల్లి మెల్లిగా హైప్ తగ్గింది, సినిమా రిలీజ్ అయ్యాక కూడా పెద్దగా టాక్ లేక పోవడం తో అంచనాలను అందుకోలేక పోయింది ఈ సినిమా.

ఆ సినిమా తర్వాత గుణశేఖర్ కొత్త సినిమాలు ఏవి చేయలేదు… కానీ ఈ సారి గట్టిగా కొట్టాలి అని మరో భారీ సినిమాను సిద్ధం చేయాలని సిద్ధం అయ్యాడు. ఆ సినిమా నే హిరణ్యకశిపుడు…. రానా హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ మైతలాజికల్ మూవీ…

ఇక మొదలు అవుతుంది అంటూ చాలా కాలంగా వార్తలు వస్తున్నా ఇన్నేళ్ళు సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులతోనే సరిపోయిందని, రీసెంట్ గా పనులు అన్నీ పూర్తీ అయ్యాయి అని గుణశేఖర్ అఫీషియల్ గా అనౌన్స్ చేశాడు. కాగా సినిమా మొత్తం మీద 120 కోట్ల రేంజ్ బడ్జెట్ లో పాన్ ఇండియా లెవల్ లో…

ఈ సినిమాను రూపొందించబోతున్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన ప్రీ ప్రొడక్షన్ పనులు మొత్తానికి ఏకంగా 15 కోట్ల రేటు అయ్యిందని ఇండస్ట్రీ లో చెప్పుకుంటున్నారు. ఇది నిజంగానే భారీ బడ్జెట్ అనే చెప్పాలి. బాహుబలి సినిమా కి కూడా ఏడాదికి అటూ ఇటూ గా సమయం పట్టగా… హిరణ్యకశిపుడు సినిమా కి మాత్రం ఏకంగా ఆల్ మోస్ట్…

4 ఏళ్ళకి పైగా టైం పట్టడం తో అంతలా ఎలాంటి ప్రొడక్షన్ పనులను సినిమా సొంతం చేసుకుంది. సినిమా కోసం ఎలాంటి సెట్స్ వేశారు లాంటివి అందరినీ ఆశగా ఎదురు చూసేలా చేస్తున్నాయి. త్వరలోనే సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా జరుగుతుందని… అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుందని అంటున్నారు…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here