ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర మలయాళ ఇండస్ట్రీ నుండి వరుస బ్లాక్ బస్టర్ మూవీస్ రాగా ఆడుజీవితం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అయిన గురువాయూర్ అంబలనాదయిల్(Guruvayoor Ambalanadayil Telugu Review) సినిమా ఆడియన్స్ ముందుకు సమ్మర్ లో రిలీజ్ అవ్వగా….
డీసెంట్ రివ్యూలతో దుమ్ము లేపిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకుని టోటల్ రన్ లో ఏకంగా 90 కోట్ల రేంజ్ దాకా గ్రాస్ ను అందుకుని బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి రీసెంట్ గా డిజిటల్ రిలీజ్ అవ్వగా సౌత్ భాషల డబ్ వర్షన్ లు కూడా రిలీజ్ చేసారు…
డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో డిజిటల్ రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ఎలా మెప్పించిందో తెలుసుకుందాం పదండీ…కథ పాయింట్ కి వస్తే పృథ్వీరాజ్ తన చెల్లెలు అనస్వర రాజన్ కి బసిల్ జోసెఫ్ తో పెళ్లి సెట్ చేస్తాడు…ఈ క్రమంలో పృథ్వీరాజ్ కి బసిల్ జోసెఫ్ కి మంచి స్నేహం ఏర్పడుతుంది…
బసిల్ జోసెఫ్ కి ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఫేల్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది, అది తెలిసినా కూడా తన చెల్లెలుతో పెళ్లికి ఒప్పుకున్న పృథ్వీరాజ్ కి అసలు నిజం తెలియదు…అదే బసిల్ జోసెఫ్ ఫ్లాష్ బ్యాక్ లో ప్రేమించింది పృథ్వీరాజ్ భార్య నిఖిలా విమల్ ని….ఈ విషయం తెలిసాకా ఏం జరిగింది…పెళ్లి జరిగిందా లేదా అన్నది సినిమా మిగిలిన కథ పాయింట్…
చాలా నార్మల్ స్టోరీ పాయింట్ అయినా ఎంటర్ టైన్ మెంట్ పరంగా కొన్ని సీన్స్ చాలా బాగా మెప్పించాగా ఎంటర్ టైన్ మెంట్ పరంగా సినిమా బాగానే ఆకట్టుకుంది… ఫస్టాఫ్ లో కొన్ని హిలేరియస్ సీన్స్ వర్కౌట్ అవ్వగా సెకెండ్ ఆఫ్ లో కథ కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా…
తిరిగి క్లైమాక్స్ ఎపిసోడ్ బాగానే ఆకట్టుకుని సినిమా పర్వాలేదు అనిపించేలా ముగుస్తుంది…లైట్ కామెడీ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ గురువాయూర్ అంబలనాదయిల్ ను ఎంజాయ్ చేయొచ్చు…కానీ మలయాళ సినిమా అంటే ఎదో కొత్తదనం కోరుకుంటే మాత్రం జస్ట్ ఓకే అనిపిస్తుంది సినిమా…
కానీ కామెడీ మూవీస్ ఇష్టపడే వాళ్ళు, ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి సినిమా అక్కడక్కడా కొంచం డ్రాగ్ అయినట్లు అనిపించినా కూడా ఓవరాల్ గా మాత్రం సినిమా ఎండ్ అయ్యే టైంకి మాత్రం డీసెంట్ ఎంటర్ టైనర్ లా మెప్పిస్తుంది సినిమా….