బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ప్రేమలు సినిమాతో సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకున్న మలయాళ యంగ్ హీరో నస్లెన్ నటించిన లేటెస్ట్ మూవీ జింఖానా(Gymkhana Telugu Movie) సినిమాను రీసెంట్ గా రిలీజ్ చేయగా మలయాళంలో మంచి విజయాన్ని సొంతం చేసుకోగా…తర్వాత తెలుగులో కూడా డబ్ అయ్యి రిలీజ్ అయిన…
సినిమాకి మంచి రెస్పాన్స్ సొంతం అయినా కూడా పోటిలో ఇతర సినిమాలు ఉండటంతో మరీ అనుకున్న రేంజ్ లో అంచనాలను అయితే అందుకోలేక పోయింది. కానీ యూత్ ఆడియన్స్ ను వీకెండ్ లో బాగానే థియేటర్స్ కి రప్పించిన సినిమా లాంగ్ రన్ లో..
పర్వాలేదు అనిపించిన తర్వాత రీసెంట్ గా డిజిటల్ లో రిలీజ్ అయిన సినిమా సోని లివ్ లో అన్ని భాషల డిజిటల్ వర్షన్ రిలీజ్ అవ్వగా ఇక్కడ ఎలాంటి రెస్పాన్స్ ను సినిమా సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా ఇక్కడ కూడా సినిమాకి ఆడియన్స్ నుండి…
ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అవుతూ ఉండటం విశేషం…స్టోరీ అంటూ పెద్దగా ఏమి లేక పోయినా కూడా ఎంటర్ టైన్ మెంట్ పరంగా సినిమా ఫస్ట్ సీన్ నుండి లైట్ కామెడీతో ఆకట్టుకోగా ఇంటర్వెల్ ఎపిసోడ్ సెకెండ్ ఆఫ్ పై అంచనాలు పెంచగా…సెకెండ్ ఆఫ్ బాక్సింగ్ నేపధ్యంలో…
వచ్చే సీన్స్ అన్నీ ఆకట్టుకోగా క్లైమాక్స్ లో అందరూ ఫైట్ చేసే సీన్ బాగా రాగా సినిమా ఎండ్ అవ్వడం కూడా బాగానే ఎండ్ అయ్యి పర్వాలేదు అనిపించేలా ఆకట్టుకుంది… నస్లెన్ తో పాటు ఇతర యాక్టర్స్ అందరూ కూడా ఆ రోల్స్ లో బాగా నటించి మెప్పించగా…
హీరోయిన్స్ కూడా ఉన్న సీన్స్ లో బాగానే మెప్పించారు…కథ పరంగా మరింత బెటర్ కంటెంట్ ఉంటే ఇంకా బాగుండేది కానీ ఓవరాల్ గా యూత్ అండ్ కామెడీ ఎంటర్ టైనర్స్ ఇష్టపడే ఆడియన్స్ కి మంచి టైం పాస్ మూవీ అని చెప్పొచ్చు… ఇక డిజిటల్ లో సాలిడ్ వ్యూవర్ షిప్ తో దుమ్ము లేపుతుంది సినిమా…