Home టోటల్ కలెక్షన్స్ జింఖానా మూవీ తెలుగు టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!!

జింఖానా మూవీ తెలుగు టోటల్ కలెక్షన్స్….హిట్టా-ఫట్టా!!

0

మలయాళంలో ఈ ఇయర్ బాక్స్ ఆఫీస్ దగ్గర  మంచి విజయాన్ని  సొంతం చేసుకున్న సినిమాల్లో ఒకటైన జింఖానా(Gymkhana Telugu Movie) సినిమాను తెలుగు లో అదే పేరుతో డబ్ చేసి రిలీజ్ చేయగా ఇక్కడ కూడా ఆడియన్స్ ను పర్వాలేదు అనిపించే రేంజ్ లో అలరించింది ఈ సినిమా…డీసెంట్ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న..

ఈ సినిమా లాంగ్ రన్ లో పర్వాలేదు అనిపించేలా పెర్ఫార్మ్ చేసింది…కొంచం బెటర్ ప్రమోషన్స్ ని చేసి రిలీజ్ చేసి ఉంటే బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా రిజల్ట్ ఇంకా బెటర్ గా వచ్చి ఉండేది అని చెప్పొచ్చు.. మొత్తం మీద సినిమా తెలుగు లో 3.25 కోట్ల రేంజ్ లో..

వాల్యూ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా మొదటి వీక్ లో మంచి జోరుని చూపించగా ఇక క్లీన్ హిట్ అవ్వడం ఖాయమని అందరూ అనుకున్నారు, కానీ రెండో వీక్ నుండి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవ్వడం వలన సినిమా టార్గెట్ ను దాటలేక పోయింది..

ఓవరాల్ గా సినిమా టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ ని గమనిస్తే..
Alappuzha Gymkhana Movie Telugu Total Collections Report
👉Nizam: 1.45Cr~
👉Total AP: 1.56Cr~
AP-TG Total:- 3.01CR(6.05Cr~ Gross)
ఇదీ సినిమా టోటల్ రన్ లో తెలుగు రాష్ట్రాల్లో సాధించిన కలెక్షన్స్ లెక్క…

కొన్ని ఏరియాల్లో మైనర్ ప్రాఫిట్స్ ను సొంతం చేసుకున్నా కూడా ఓవరాల్ గా వాల్యూ బిజినెస్ ను రికవరీ చేసిన సినిమా టార్గెట్ 3.25 కోట్ల మార్క్ ని మిస్ చేసుకుంది. కొంచం ప్రమోషన్స్ ను చేసి సినిమాను రిలీజ్ చేసి ఉంటే కచ్చితంగా తెలుగు లో ఇంకా బెటర్ రిజల్ట్ ను సినిమా సొంతం చేసుకుని ఉండేది…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here