బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ వీకెండ్ తెలుగు రిలీజ్ అవుతున్న సినిమాల్లో ఎంతో కొంత హైప్ ను సొంతం చేసుకున్న సినిమా హ్యాప్పీ బర్త్ డే… మత్తు వదలరా లాంటి హిట్ మూవీ తర్వాత రితేష్ రానా డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా సరియల్ కామెడీ అంటూ ఆడియన్స్ ముందుకు వచ్చేయగా సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….
ప్రతీ ఒక్కరి చేతిలో గన్ ఉండాలి అంటూ ఓ గన్ అమెన్మేంట్ లా ని అమలు చేస్తాడు మినిస్టర్ వెన్నల కిషోర్… అదే టైం లో లావణ్య త్రిపాటి ఓ బర్త్ డే పార్టీకి ఓ హోటల్ కి వెళుతుంది, అక్కడ ఇతర క్యారెక్టర్స్ అందరూ వస్తారు. తర్వాత ఏం జరిగింది అన్నది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…
పెర్ఫార్మెన్స్ పరంగా అందరూ ఆకట్టుకున్నారు, లావణ్య త్రిపాటి తన వరకు ఆకట్టుకోగా, సత్య మాత్రం ఓ రేంజ్ లో కుమ్మేశాడు, వెన్నెల కిషోర్ కొన్ని సీన్స్ లో రెచ్చిపోయాడు… మిగిలిన యాక్టర్స్ కూడా కొన్ని కొన్ని సీన్స్ లో మెప్పించారు. ఇది రొటీన్ స్టొరీ అయితే కాదు, అలా అని ఫుల్ ఎంటర్ టైనర్ కూడా కాదు….
ఈ సినిమా చూడాలి అని ఫిక్స్ అయితే బ్రెయిన్ ని ఇంట్లో పెట్టేసి…. థియేటర్స్ కి వెళ్లి కూర్చుని సినిమా చూడటం స్టార్ట్ చేస్తే లాజిక్ లేని సీన్స్ వస్తూ వెళుతూ ఉంటె అక్కడక్కడా కామెడీ సీన్స్ అలరించినా కొన్ని సీన్స్ బోర్ కూడా కొట్టిస్తాయి. పార్టు పార్టులుగా కామెడీ వర్కౌట్ అవ్వడం ప్లస్ పాయింట్స్ అయితే కథ అండ్ స్క్రీన్ ప్లే చాలా నెమ్మదిగా సాగడం…
సీన్ కి సీన్ కి లింక్ లేనట్లు ఉన్న స్క్రీన్ ప్లే నిరాశ పరచడం మైనస్ పాయింట్స్. అన్నింటిని తట్టుకుని ఊపికతో కూర్చొని చూస్తె సినిమాలో అక్కడక్కడా కొన్ని సీన్స్ హిలేరియస్ గా నవ్విస్తాయి, మొత్తం మీద అంచనాలు ఏమి పెట్టుకోకుండా లాజిక్స్ ఏమి వెతకకుండా సినిమా చూస్తె ఒకసారి చూడొచ్చు అనిపిస్తుంది. మత్తు వదలరా లాంటి ఔట్ అండ్ ఔట్ హిలేరియస్ ఎంటర్ టైనర్ అనుకుని వెళితే మట్టుకు నిరాశ కలగక తప్పదు…. సినిమా కి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…