టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) మూవీస్ లో హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu Movie) ఈ ఇయర్ ఆడియన్స్ ముందుకు సమ్మర్ కానుకగా రిలీజ్ కి సిద్ధం అవుతున్న బిగ్ మూవీ….చాలా టైంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా మీద ఫ్యాన్స్ లో ఆడియన్స్ లో మంచి అంచనాలే ఉన్నాయి అని చెప్పాలి…
పొలిటికల్ గా సూపర్ సక్సెస్ అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నుండి వస్తున్న సినిమా అవ్వడంతో అంచనాలు సాలిడ్ గా ఉండగా రీసెంట్ గా సినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు మేకర్స్….మాట వినాలి అంటూ లిరిక్ తో తెరకెక్కిన ఈ సాంగ్ ను…
స్వయంగా పవన్ కళ్యాణ్ పాడటంతో ఓవరాల్ గా పాట యావరేజ్ గా ఉన్నప్పటికీ కూడా ఫ్యాన్స్ నుండి బాగుంది అనిపించే రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకోగా ఇతర ఫ్యాన్స్ నుండి యావరేజ్ రేంజ్ లో రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…అయినా కానీ యూట్యూబ్ లో…
ఈ సాంగ్ కి ఓవరాల్ గా సాలిడ్ రెస్పాన్స్ సొంతం అయ్యింది అని చెప్పాలి..లైక్స్ పరంగా కొత్త రికార్డులు ఏమి నమోదు అవ్వలేదు కానీ వ్యూస్ పరంగా మాత్రం టాలీవుడ్ లిరికల్ వీడియోలలో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ను సొంతం చేసుకుని మాస్ రచ్చ చేసింది ఈ సాంగ్…
మొత్తం మీద 24 గంటలు పూర్తి అయ్యే టైంకి యూట్యూబ్ లో ఈ సాంగ్ కి 19.51 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యాయి…ఇక లైక్స్ పరంగా 24 గంటల్లో 338K లైక్స్ మార్క్ ని అందుకుని ఓవరాల్ గా మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది…. మొత్తం మీద వ్యూస్ పరంగా…
టాలీవుడ్ లో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ లో దుమ్ము లేపిన ఈ సాంగ్ లైక్స్ పరంగా టాప్ 10 లో కూడా ఎంటర్ అవ్వలేక పోయింది. అయినా కూడా సినిమా మీద మంచి అంచనాలే ఉన్న నేపధ్యంలో సినిమా సమ్మర్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం ఖాయమని చెప్పొచ్చు.