Home న్యూస్ సుదీర్ బాబు ‘హరోం హర’ బిజినెస్, థియేటర్స్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

సుదీర్ బాబు ‘హరోం హర’ బిజినెస్, థియేటర్స్….బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కోసం చాలా టైంగా ఎదురు చూస్తున్న హీరోలలో ఒకరైన సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర(Harom Hara Movie) సినిమా ఆడియన్స్ ముందుకు ఈ శుక్రవారం రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా తెలుగు రాష్ట్రాలలో సినిమా ఇప్పుడు మొత్తం మీద 450 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుండగా…

వరల్డ్ వైడ్ గా సినిమా 600 వరకు థియేటర్స్ లో రిలీజ్ ను సొంతం చేసుకోబోతుంది….ఇక సినిమా తెలుగు రాష్ట్రాల ఓవరాల్ బిజినెస్ రేంజ్ 5 కోట్ల దాకా ఉండగా కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా మరియు ఓవర్సీస్ లు కలిపి మరో కోటి రేంజ్ లో బిజినెస్ ను సినిమా సొంతం చేసుకుందని సమాచారం…

Harom Hara Movie Pre Release Business – Break Even Target
దాంతో టోటల్ వరల్డ్ వైడ్ గా సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ రేంజ్ 6 కోట్ల రేంజ్ దాకా ఉంటుందని అంచనా…ఇప్పుడు సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్రేక్ ఈవెన్ ని అందుకోవాలి అంటే 6.5 కోట్లకు పైగా షేర్ ని అందుకోవాల్సిన అవసరం ఉంటుంది…మాస్ కంటెంట్ తోనే తెరకెక్కిన హరోం హర మూవీకి ఆడియన్స్ నుండి మంచి టాక్ సొంతం అయితే….

ఈ టార్గెట్ ను అందుకోవడం పెద్ద కష్టమేమి కాదని చెప్పాలి. ప్రభాస్(Prabhas) కల్కి(Kalki Movie) వచ్చే వరకు మాస్ ఆడియన్స్ కి మంచి ఆప్షన్స్ ఏవి లేవు కాబట్టి ఈ సినిమా ఆడియన్స్ ను మెప్పించేలా ఉంటే కచ్చితంగా బ్రేక్ ఈవెన్ ని అందుకుని మంచి విజయాన్ని నమోదు చేసే అవకాశం ఉంటుంది.

అలాగే సుదీర్ బాబుకి మంచి కంబ్యాక్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు. మరి హరోం హర మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుంది సుదీర్ బాబుకి ఎలాంటి కంబ్యాక్ ను సొంతం అయ్యేలా చేస్తుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here