Home న్యూస్ ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు….సుదీర్ బాబు వాడుకుంటాడా మరి!

ఇంతకన్నా మంచి ఛాన్స్ రాదు….సుదీర్ బాబు వాడుకుంటాడా మరి!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా టైం అవుతున్న హీరోలలో సుదీర్ బాబు(Sudheer Babu) ఒకరు…ఓ మంచి హిట్ కోసం చాలా టైంగా ఎదురు చూస్తున్న వాళ్ళలో ఒకరైన సుదీర్ బాబు రీసెంట్ టైంలో చేసిన సినిమాలు నిరాశ పరిచే రిజల్ట్ లను సొంతం చేసుకోగా లాస్ట్ మూవీ కూడా పెద్దగా ఇంపాక్ట్ ను చూపలేదు…కానీ ఇప్పుడు తన కెరీర్ లో టర్నింగ్ పాయింట్ అవుతుంది అనుకుంటున్న…

చిన్న సినిమా అనుకున్నారు…రాజు యాదవ్ నాన్ థియేట్రికల్ బిజినెస్ ఎంతో తెలుసా!
హరోం హర(Harom Hara Movie) సినిమా డీసెంట్ అంచనాల నడుమ ఈ వీకెండ్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా ట్రైలర్ సినిమా మీద డీసెంట్ అంచనాలను అయితే ఏర్పడేలా చేసింది. ఇక సినిమా లో మాస్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉండటంతో ఆడియన్స్ ను అలరించే అవకాశం ఎంతైనా ఉంది. 

ఇక సినిమాకి ఇప్పుడు మంచి హిట్ అయ్యి సుదీర్ బాబుకి మంచి కంబ్యాక్ ని ఇచ్చే అవకాశం ఎంతైనా ఉండగా లాస్ట్ వీక్ లో రిలీజ్ అయిన మనమే(Manamey Movie) క్లాస్ మూవీ అవ్వడంతో మాస్ సెంటర్స్ లో పెద్దగా ఇంపాక్ట్ ఉండదు. ఇక సినిమా కూడా వర్కింగ్ డేస్ లో కొంచం స్లో డౌన్ అయింది కూడానూ…

ఆ ఒక్కటి అడక్కు: 4.50 కోట్ల టార్గెట్….టోటల్ గా వచ్చింది ఇది…హిట్టా-ఫట్టా!
ఇక కల్కి 2898AD( Kalki2898AD Movie) సినిమా సైతం రావడానికి ఇంకా 2 వారాల టైం ఉండటంతో…ఈ గ్యాప్ లో రిలీజ్ అవుతున్న నోటబుల్ మాస్ మూవీ హరోం హరనే అవ్వడం, సినిమాకి డీసెంట్ బజ్ కూడా ఉండటంతో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి హిట్ అండ్ కంబ్యాక్ కి అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.

ఇక సుదీర్ బాబు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమాతో ఇప్పుడు ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటాడు అన్నది ఆసక్తిగా మారగా సినిమాకి కనుక టాక్ కూడా ట్రైలర్ రేంజ్ లో బజ్ ను మ్యాచ్ చేసే విధంగా టాక్ పాజిటివ్ గా వస్తే కల్కి వచ్చే వరకు కూడా మంచి కలెక్షన్స్ సొంతం చేసుకునే అవకాశం ఉంటుంది. మరి సుదీర్ బాబు ఈ అవకాశాన్ని ఎంతవరకు వాడుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here