Home న్యూస్ రిలీజ్ కి ముందు రోజు సుదీర్ బాబు హరోం హర ఇంటర్వెల్ సీన్ లీక్…టీం కి...

రిలీజ్ కి ముందు రోజు సుదీర్ బాబు హరోం హర ఇంటర్వెల్ సీన్ లీక్…టీం కి పెద్ద షాక్!

0

ఇండస్ట్రీ కి పైరసీ అప్పట్లో పెద్ద అడ్డంకిగా ఉండేది, కానీ క్రమంగా డిజిటల్ రిలీజ్ లు త్వరగా వస్తూ ఉండటంతో కొన్ని రోజులు ఆగితే సినిమాల ఒరిజినల్ ప్రింట్స్ ఎలాగూ వస్తూనే ఉండటంతో జనాలు పైరసీకి కొంచం దూరంగా ఉంటూ ఉన్నా కూడా సినిమాలకు అప్పుడప్పుడు లీక్ ల బెడత కూడా ఇబ్బందులు పెడుతూ ఉండటం విచారకరం అని చెప్పాలి.

రీసెంట్ గా ఈ లీక్ ల ఎదురుదెబ్బ ఇప్పుడు సుదీర్ బాబు(Sudheer Babu) నటించిన లేటెస్ట్ మూవీ హరోం హర(Harom Hara Movie) సినిమా విషయంలో ఇప్పుడు ఇంటర్వెల్ ఎపిసోడ్ లో మేజర్ పోర్షన్ సోషల్ మీడియాలో లీక్ అయ్యింది…. రీసెంట్ గా ప్రభాస్(Prabhas) కల్కి మూవీ ట్రైలర్ కూడా కొంచం పార్ట్ లీక్ అవ్వగా…

ఇప్పుడు ఏకంగా శుక్రవారం రిలీజ్ కాబోతున్న హరోం హర సినిమా ఇంటర్వెల్ సీన్ సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో టీం కి షాక్ తగిలినట్లు అయింది….సినిమాలో కీలకమైన సీన్ ఇలా సోషల్ మీడియాలో లీక్ అవ్వడంతో ఈ లీక్ వెనక ఎవరు ఉన్నారు అని సినిమా టీం ఎంక్వయిరీలు మొదలు పెట్టినట్లు తెలుస్తుంది…

కానీ ఈ లోపు సోషల్ మీడియాలో ఈ సీన్ ఆల్ రెడీ సర్క్యులేట్ అవుతూ ఉండటంతో సినిమా మీద ఏమైనా ఇంపాక్ట్ ఉంటుందేమో అన్న అనుమానాలు ఉన్నాయి. సుదీర్ బాబు హరోం హర సినిమా మీద మంచి హోప్స్ ను పెట్టుకున్నాడు…. మరి సినిమా ఈ లీక్ ఇంపాక్ట్ ను తట్టుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి రిజల్ట్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇప్పుడు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here