Home న్యూస్ హరోం హర ట్రైలర్ రివ్యూ…సుదీర్ బాబు…మాస్ సంభవం!

హరోం హర ట్రైలర్ రివ్యూ…సుదీర్ బాబు…మాస్ సంభవం!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర చాలా టైంగా హిట్ కోసం ఆశగా ఎదురు చూస్తున్న హీరోలలో సుదీర్ బాబు(Sudheer Babu) ఒకరు కాగా ఆడియన్స్ ముందుకు ఇప్పుడు ఇప్పుడు హరోం హర(Harom Hara Movie) అంటూ మాస్ కంటెంట్ తో జూన్ 14న ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతూ ఉండగా ఈ సినిమా తన కెరీర్ లో…

మంచి టర్నింగ్ పాయింట్ గా నిలుస్తుంది అన్న నమ్మకంతో ఉన్నాడు సుదీర్ బాబు. ఇక రీసెంట్ గా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ చాలా వరకు ప్రామిసింగ్ గా అనిపిస్తూ ఉంది…హీరోకి గన్స్ తయారు చేసి అమ్మడంలో ఉన్న లాభాలు తెలిసి రావడంతో గన్స్ ను తయారు చేయడం మొదలు పెడతాడు…

అక్రమంగా తయారు చేసే ఈ గన్స్ వలన హీరో వెనక పొలుసులు మరో పక్క మాఫీయా వాళ్ళు పడుతూ ఉంటారు…మరి హీరో తర్వాత ఏం చేశాడు అన్న కథని సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. ఇలాంటి కథలు కొత్త కాకపోయినా కూడా సుదీర్ బాబు ఫస్ట్ టైం ఇలాంటి మాఫియా టచ్ ఉన్న కథని చేస్తూ ఉండటంతో…

బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టుకునేలా సినిమా ఉంటే సుదీర్ బాబుకి మంచి కంబ్యాక్ గా నిలిచే అవకాశం ఎంతైనా ఉంది. ట్రైలర్ లో డైలాగ్స్ అంత క్లియర్ గా వినిపించకపోవడం ఒక్కటి చిన్న మైనస్ లా అనిపించగా ప్రింట్ మరీ డార్క్ గా ఉన్నట్లు అనిపించింది. ఇవి పక్కకు పెడితే సుదీర్ బాబు యాక్షన్ సీన్స్…

మంచి బ్యాగ్రౌండ్ స్కోర్ లు ఓవరాల్ గా ట్రైలర్ మీద పాజిటివ్ ఫీలింగ్స్ కలిగేలా చేసింది. ఇక సినిమా కూడా ట్రైలర్ రేంజ్ లోనే మెప్పిస్తుందో లేదో చూడాలి. సుదీర్ బాబు ప్రీవియస్ మూవీ మామా మశ్చీంద్ర కూడా ట్రైలర్ ఆకట్టుకున్నా సినిమా అంచనాలను అందుకోలేక పోయింది. ఇక హరోం హర సినిమాతో సుదీర్ బాబు మాస్ సంభవం సాధ్యం అవుతుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here