Home న్యూస్ అందరి కన్నా ముందు అనౌన్స్ చేసిన వాడే…రేసు నుండి తప్పుకున్నాడుగా!

అందరి కన్నా ముందు అనౌన్స్ చేసిన వాడే…రేసు నుండి తప్పుకున్నాడుగా!

0

చాలా టైంగా బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కోసం ఎదురు చూస్తున్న యాక్టర్స్ లో సుదీర్ బాబు(Sudheer Babu) ఒకరు….ఒకటి రెండు మంచి విజయాలు సొంతం అయినా కూడా తనకంటూ ఓ డీసెంట్ మార్కెట్ ను సెట్ చేసుకోవడంలో కొంచం వెనకబడిన సుదీర్ బాబుకి కొన్ని మంచి సినిమాలు పడినా కూడా ఫ్లాఫ్ మూవీస్ ఇంపాక్ట్ వలన అనుకున్న రేంజ్ లో సక్సెస్ రాలేదు…

ఇక ఇప్పుడు ఆడియన్స్ ముందుకు తన లేటెస్ట్ మూవీ హరోం హర(Harom Hara Movie) తో మంచి కంబ్యాక్ కోసం ఎదురు చూస్తున్న సుదీర్ బాబు ఈ సినిమాను ముందే రిలీజ్ చేయాలి అనుకున్నా సరైన టైం కోసం ఎదురు చూస్తూ ఉండగా ఎట్టకేలకు పోటి లేకుండా సోలో రిలీజ్ ను ఎంచుకుని ముందుగా అనౌన్స్ చేశాడు….

అదే మే 31న తన సినిమా రిలీజ్ అని అనౌన్స్ చేశాడు…దాంతో ఎలక్షన్స్ హడావుడి తగ్గిన తర్వాత మంచి వీకెండ్ అని అందరూ అనుకున్నారు. కానీ ఈ సినిమా రిలీజ్ ను అనౌన్స్ చేసిన వెంటనే వరుస పెట్టి కొన్ని ఇతర నోటబుల్ మూవీస్ రిలీజ్ లు కన్ఫాం చేసుకున్నాయి…. కార్తికేయ నటించిన భజే వాయు వేగం, ఆనంద్ దేవరకొండ గం గం గణేశ…

లాంటి సినిమాలు రిలీజ్ లు అనౌన్స్ చేయగా మే 17న రిలీజ్ అవ్వాల్సిన విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా కూడా పోస్ట్ పోన్ అయ్యి ఇప్పుడు అదే డేట్ కి రిలీజ్ ను కన్ఫాం చేసుకుంది. దాంతో ఒక్క రోజున నాలుగు నోటబుల్ మూవీస్ రిలీజ్ ను సొంతం చేసుకోవడం వలన ఏ సినిమాకి ఉపయోగం అయితే ఉండదు అని చెప్పాలి.

దాంతో ఇప్పుడు అందరి కన్నా ముందు రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన సుదీర్ బాబు హరోం హర సినిమా రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసి ఫ్రెష్ గా జూన్ 14 న రిలీజ్ చేయబోతున్నట్లు అనౌన్స్ చేశారు. దాంతో మే 31న 3 సినిమాల మధ్య పోటి ఉండబోతుండగా కంప్లీట్ గా ఎలక్షన్స్ రిజల్ట్ హడావుడి అయిన తర్వత హరోం హర రిలీజ్ కానుంది…మరి సోలో రిలీజ్ తో సుదీర్ బాబు ఎంతవరకు సక్సెస్ ను అందుకుంటాడో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here