Home గాసిప్స్ ఆ డైరెక్టర్ 100 సినిమా ట్రై చేస్తే 107 ఫిక్స్ అయ్యిందిగా!

ఆ డైరెక్టర్ 100 సినిమా ట్రై చేస్తే 107 ఫిక్స్ అయ్యిందిగా!

1874
0

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలను కమిట్ అవుతూ దూసుకు పోతున్నాడు, కానీ ఎవరు పడితే వారు కాకుండా ఈ సారి కొంచం క్రేజీ కాంబినేషన్స్ ని సెట్ చేస్తూ ఉండటం విశేషం. లేటెస్ట్ గా బాలయ్య కమిట్ అయిన అయిన మూవీస్ లో మరో క్రేజీ ప్రాజెక్ట్ ఓకే అవ్వగా ఆ డైరెక్టర్ బాలయ్య 100 వ రేసు లో కూడా పోటి పడగా ఎందుకనో మిస్ అయింది.

ఆ డైరెక్టర్ మరెవరో కాదు… టాలీవుడ్ లో అడుగు పెట్టినప్పటి నుండి అపజయం అంటే తెలియకుండా హిట్స్ మీద హిట్స్ కొడుతున్న డైరెక్టర్ అనిల్ రావిపూడి… బాలయ్య తో సినిమా కోసం అనిల్ రావిపూడి ఎప్పటి నుండో ట్రై చేస్తూ ఉండగా బాలయ్య 100 వ సినిమా టైం లో కూడా ప్రయత్నాలు…

చాలా గట్టిగా చేయగా ఆ టైం లో సుప్రీమ్ ని కంప్లీట్ చేసి బాలయ్య కి కథని కూడా వినిపించినా తర్వాత సడెన్ గా క్రిష్ గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా వలన ఈ సినిమా సెట్ కాలేదు, దాంతో అనిల్ రావిపూడి ఆ టైం లో రాజా ది గ్రేట్ మూవీ డైరెక్ట్ చేశాడు.

100వ మూవీ ట్రై చేస్తే ఇప్పుడు బాలయ్య 107 వ సినిమా డైరెక్షన్ ఛాన్స్ ఆల్ మోస్ట్ అనిల్ రావిపూడి చేతిలోనే ఉందనే టాక్ టాలీవుడ్ లో చాలా గట్టిగా వినిపిస్తుంది, ప్రస్తుతం బోయపాటి తో అఖండ ఫైనల్ స్టేజ్ లో ఉండగా తర్వాత బాలయ్య గోపీచంద్ మలినేని తో సినిమా అనుకున్నా కొంచం టైం పట్టే చాన్స్ ఉండగా…

ఈ లోపు ఇప్పుడు అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సినిమాను తక్కువ టైం లో పూర్తీ చేసే ఆలోచన లో ఉన్నారని తెలుస్తుంది. ప్రస్తుతానికి అయితే బాలయ్య చేయబోతున్న మూడు సినిమాలు కూడా క్రేజీ మూవీస్ అనే చెప్పాలి. మరి ఇవన్నీ అంచనాలను అందుకుంటే కచ్చితంగా బాక్స్ ఆఫీస్ దగ్గర రచ్చ రచ్చ చేయడం ఖాయం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here