Home న్యూస్ 25 కోట్ల టార్గెట్… ఫస్ట్ డే వచ్చింది ఇది!

25 కోట్ల టార్గెట్… ఫస్ట్ డే వచ్చింది ఇది!

685
0

  యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా అనుపమా మరమేశ్వర్ హీరోయిన్ గా త్రినాధ రావ్ నక్కిన డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మించిన లేటెస్ట్ మూవీ హెలో గురు ప్రేమ కోసమే రీసెంట్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి టాక్ నే సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. టోటల్ వరల్డ్ వైడ్ గా సుమారు 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద మొదటి రోజు వసూళ్ల పరంగా రామ్ కెరీర్ బెస్ట్ రికార్డులను జస్ట్ లో మిస్ అయింది.

నైజాంలో 1.53 కోట్లు, సీడెడ్ లో 50 లక్షలు, టోటల్ ఆంధ్రాలో 1.72 కోట్ల షేర్ ని అందుకున్న ఈ సినిమా రెండు రాష్ట్రాల ఆవల టోటల్ గా 50 లక్షల దాకా షేర్ ని అందుకుంది.. దాంతో మొదటి రోజు టోటల్ గా సినిమా 4.25 కోట్ల షేర్ ని అందుకుంది.

లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన ఉన్నది ఒకటే జిందగీ మొదటి రోజు 4.4 కోట్ల షేర్ ని అందుకుంది. కాగా జస్ట్ 15 లక్షల తేడా తో తొలిరోజు కెరీర్ బెస్ట్ మిస్ అయినా కానీ పోటీ లో మంచి వసూళ్లతో సినిమా 25 కోట్ల టార్గెట్ లో 4.25 కోట్ల ని వెనక్కి తెచ్చింది. ఇక రెండో రోజు ఎలా పెర్ఫర్మ్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here