అదేంటి సినిమా లో ఛాన్స్ కోసం హీరో డైరెక్టర్ కి డబ్బులు ఎదురు ఇవ్వడం ఏంటి అని అనుకుంటున్నారా.. దానికి ఒక కారణం ఉంది…. సరిగ్గా 15 ఏళ్ల క్రితం ఆడియన్స్ ముందుకు పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి అల్టిమేట్ విజయాన్ని నమోదు చేసిన సినిమా హింసించే 23 వ రాజు పులకేసి. కమెడియన్ నుండి హీరోగా మారి వడివేలు చేసిన ఈ సినిమా కి డైరెక్టర్ శంకర్ నిర్మాతగా మార తీయగా…
విజయ్ తో పులి సినిమా తీసిన డైరెక్టర్ శింబు దేవన్ మొదటి సినిమాగా ఈ సినిమా రూపొందింది. బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయిన తర్వాత తమిళ్ లో బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న ఈ సినిమా తెలుగు లో కూడా డబ్ అయ్యి అల్టిమేట్ విజయాన్ని…
సొంతం చేసుకుని దుమ్ము లేపింది. అలాంటి ఈ సినిమా కి ఆ టైం లోనే సీక్వెల్ చేయాలనీ ఫిక్స్ అయ్యి కథని సిద్ధం చేసుకున్నారు. కొన్నేళ్ళ క్రితం సినిమా సీక్వెల్ ని అనౌన్స్ చేసి షూటింగ్ కూడా మొదలు పెట్టారు. కానీ స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేయడం అలాగే వడివేలు…
రాజకీయాల్లో అడుగు పెట్టడం తో యూనిట్ తో గొడవలు జరగగా సడెన్ గా సినిమా నుండి తప్పుకున్నాడు హీరో వడివేలు. దాంతో శంకర్ కి కోపం వచ్చి కోర్టులో కేసు కూడా వేయగా అప్పటి నుండి ఆ కేసు నడుస్తూనే ఉండగా సినిమా మధ్యలోనే ఆగిపోవాల్సి వచ్చింది. కాగా రీసెంట్ గా ఎలాగోలా వీళ్ళ మధ్య గొడవలకు చెక్ పడిందని సమాచారం.
ఇక వడివేలు తప్పుకోవడం వలన షూటింగ్ కి ఇబ్బంది కలిగి ఆగిపోయింది కాబట్టి నష్టపరిహారం కట్టాల్సిందే అని చెప్పగా అందుకు గాను 2 కోట్లు చెల్లించడానికి వడివేలు ఒప్పుకున్నారట. దాంతో సమస్యలు తొలగిపోయి త్వరలోనే సినిమా సెట్స్ పైకి వెళుతుందని, ఆడియన్స్ ముందుకు ఈ సీక్వెల్ 24 వ రాజు పులకేసి గా వచ్చే ఇయర్ రావొచ్చని అంటున్నారు ఇప్పుడు.