ఐటెం సాంగ్ చేయడానికి ఒప్పుకుంది అంటున్న కాజల్ కూడా చాలా సమయం తీసుకుని ఎన్టీఆర్ తో డాన్స్ కి ఓకే చేసినట్లు సమాచారం….దానికి కారణం సాంగ్ లో లిరిక్స్ అంత ఫాస్ట్ గా ఏమి లేకున్నా ఎన్టీఆర్ పక్కన డాన్స్ అనగానే హీరోయిన్స్ పరార్ అయ్యారట.
చాలామంది టాప్ టు క్రేజీ హీరోయిన్స్ ని అడగ్గా ఎన్టీఆర్ పక్కన డాన్స్ చేయలేం అంటూ చేతులెత్తేశారట…దాంతో కుదిరితే మళ్ళీ కాజల్ ని కానీ తమన్నాని కానీ ఫైనల్ చేయాలి అనుకుని ఆఖరికి కాజల్ నే సెలెక్ట్ చేసి ఆమెని ఒప్పించి స్పెషల్ సాంగ్ చేయించబోతున్నట్లు తెలుస్తుంది. ఎన్టీఆర్ తో డాన్స్ అంటే సింగిల్ టేక్ లో చేయాలి అన్న విషయం అందరికీ తెలియడం వల్లే హీరోయిన్స్ ఎన్టీఆర్ తో డాన్స్ కి జంకుతున్నారు అంటున్నారు ఇప్పుడు….